calender_icon.png 21 August, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సతీష్ మ్యూజిక్ అకాడమీ బృందానికి అవకాశం కల్పించాలి

20-08-2025 11:53:20 PM

అకాడమీ డైరెక్టర్ అమరవరపు సతీష్

గరిడేపల్లి,(విజయక్రాంతి): సూర్యాపేట జిల్లాలో జరిగే ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలకు సతీష్ మ్యూజిక్ అకాడమీ డప్పుల బృందం వారికి అవకాశం కల్పించాలని సతీష్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అమరవరపు సతీష్ జిల్లా కలెక్టర్ నంద లాల్ పవార్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాల నుండి ప్రభుత్వ సాంస్కృతిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొనడం జరిగిందని,గత మూడు సంవత్సరాలుగా హైదరాబాదులోని గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో,దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.