21-08-2025 12:31:53 AM
- కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
టేకులపల్లి, ఆగస్టు 20, (విజయక్రాంతి):కాబోయే భర్త వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన సం ఘటన భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లి మండలంలో చోచోటు చేసుకుంది బేతం పూడి పంచాయతీ వెంకట్యాతండాకు చెందిన తులికశ్రీ అనే యూవతితో, లక్మిదేవి పల్లి సీతారాంపురానికి చెందిన బిచ్చాతో వివాహం ని శ్చయమైంది.
ఇటీవల భద్రాచలం వెళ్లొచ్చాక బిచ్చా వేధించడంతో మనస్తాపం చెందిందని కుటుంబ సభ్యు లు తెలిపారు. దీంతో యువతి ఈ నెల 13న పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తులికశ్రీ కాబోయే భర్త వేధింపులతో ఆత్మ హత్యకు పాల్పడిన సమాచారం తెలుసుకున్న ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బు ధవారం వెంకట్యాతండాలోని నివాసానికి వెళ్లి భౌతికాయానికి నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరం సురేందర్-ఉమా, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈది గణేష్, భూక్యా సర్దార్, బానోత్ రవి, తదితరులు పాల్గొన్నారు.