calender_icon.png 17 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భీమన్న గుట్ట భూములు కాపాడాలి

17-10-2025 07:13:14 PM

నిర్మల్,(విజయక్రాంతి): భీమన్న గుట్ట ప్రాంతం అన్యాక్రాంతం కాకుండా చూడాలని, ముదిరాజ్లకు కేటాయించిన స్థలాన్ని వారికే అప్పగించి న్యాయం చేయాలని కోరుతూ ముదిరాజ్ కులస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. ఎన్నో ఏళ్లుగా పండ్ల చెట్ల పెంపకం ద్వారా ముదిరాజ్ కులస్తులకు జీవనోపాధి కల్పిస్తున్న భీమన్న గుట్ట ప్రాంతం నేడు ఆక్రమణలకు గురవుతుందని ముదిరాజ్ కుల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యాయం చేయాలని వారు కోరారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ముదిరాజ్ కులస్తులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.