17-05-2025 12:26:17 AM
సిరిసిల్ల/నిర్మల్/కుమ్రంభీం ఆసిఫాబాద్, మే 16 (విజయక్రాంతి): రాష్ట్రంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం తెచ్చిన భూ భారతి చట్టం దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్‌పేట్, నిర్మల్ జిల్లా కుంటాల మండల కేంద్రాల్లో భూభారతి చట్టంపై నిర్వహించిన అవగాహన సదస్సు లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కతో కలిసి పాల్గొన్నారు.
సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో మంత్రులు సీతక్క, పొ న్నం ప్రభాకర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. జూన్ 2 నాటికి పైలెట్ ప్రాజెక్టు మండలాల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి భూ సమస్యతో ఏ ఒక్క రైతు కూడా ప్రభుత్వ కార్యాలయానికి రాకూడదన్న ఉద్దేశంతోనే తమ ప్రభుత్వం పని చే స్తుందని చెప్పారు.
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు జిల్లాలతో పాటు మిగతా 28 జిల్లాల్లో ఒక్కొక్క మండలంలో పైలట్ ప్రాజెక్టు కింద భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపారు. ధరణి ఫోల్డర్‌ను అమలు చేయడం వల్ల భూ రికార్డులు తారుమారు అయ్యాయని, వేలకోట్ల విలువచేసే భూసంపదను కొందరు దోచుకుని దాచుకున్నారని ఆరోపించారు.
పైలెట్ ప్రాజెక్టు కింద చేపట్టిన భూభారతి చట్టంలో ఇప్పటివరకు 41 వేల దరఖాస్తులు వచ్చాయని వాటిలో 30 వేల దరఖాస్తులను పరిష్కరించేందుకు అవకాశం ఉందని తెలిపారు. గత బీఆర్‌ఎస్ హయాం లో కేసీఆర్ తెచ్చిన ధరణిలోని లోపాలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు.
సమస్యల పరిష్కారిని వారు కోరుకున్న విధంగా భూభారతి చట్టాన్ని రూ పకల్పన చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో 6 వేల మంది ప్రభుత్వ సర్వేయర్లు, వెయ్యి మంది లైసెన్సుడు సర్వేయర్ల నియామకం చేపడుతున్నట్లు తెలిపారు. జూన్ 2 నాటికి గ్రామ రెవెన్యూ అధికారులను తిరిగి నియమిస్తామని చెప్పారు.
కాగా నిర్మల్, ఆసిఫా బాద్ జిల్లాలో పోడు వ్యవసాయం చేస్తున్న రైతులను ఇబ్బందులకు గురి చేయవద్దని, పోడు వ్యవసాయం చేస్తున్న వారిని అడ్డుకోవద్దని అటవీశాఖ అధికారులకు సూచించా రు. అసైన్డ్ భూములకు కూడా హక్కులు కల్పిస్తామని చెప్పారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆటవిశాఖ అధికారులు అడ్డంకులు పెట్టవద్దని తెలిపారు. ప్రభుత్వ పథకా లు నిరంతర ప్రక్రియ అని, లబ్ధిదారులు ఆందోళన చెందవద్దని చెప్పారు.
బీఆర్‌ఎస్ నేతల అరెస్టు
నిర్మల్ జిల్లా కుంటాలకు వెళ్తున్న మం త్రుల కాన్వాయ్‌ను బీఆర్‌ఎస్ నేతలు అడ్డుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రుణమాఫీ, పెట్టుబడి సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ముధోల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు మంత్రుల కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
భూమితోనే జీవితం ముడిపడింది: మంత్రి సీతక్క
భూమితోనే మానవ జీవితం ముడిపడి ఉందని మంత్రి సీతక్క అ న్నారు. బీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతో నే భూ సమస్యలు పెరిగాయని ఆరోపించారు. ఐటీడీఏ ద్వారా గిరిజ నుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన వారి కి తప్పకుండా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు.
ఆసిఫాబాద్ జిల్లాలో 80 శాతం రైతాంగం సాగుపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని వారి సమస్యలు పరిష్కరిం చేందుకు కృషి చేస్తామన్నారు. కాగా నిర్మల్ జిల్లాలోని టైగర్ జోన్‌లో పునరావాస గ్రామాల గిరిజనులకు శాశ్వ త భూమిపట్టాలను ఇవ్వాలని రెండు సంవత్సరాలుగా కోరుతున్నా సమస్య పరిష్కారం కాలేదు.
భూభారతి చట్టం లో 176 మందికి భూమి హక్కు పత్రాలను అందించడంతో గిరి జన రైతు లు సంతోషం వ్యక్తం చేశారు. పెంచికల్‌ఫేటలో రెవెన్యూశాఖ ప్రిన్సిపల్ సె క్రటరీ నవీన్ మిట్టల్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే హరీశ్‌బాబు, కుంటాలలో ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు పటేల్, రామారావు పటేల్, రుద్రంగిలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ప్ర భుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.