17-05-2025 09:55:59 PM
జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగువాన్...
కామారెడ్డి (విజయక్రాంతి): భూభారతి దరఖాస్తులను పరిశీలించి పాజిటివ్ నెగిటివ్లను ఆలోచించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్(District Collector Ashish Sangwan) తెలిపారు. శనివారం కామారెడ్డి జిల్లా లింగంపేట తాసిల్దార్ కార్యాలయంలో అధికారులతో చర్చించారు. లింగంపేటలో భూ భారతి పైలట్ ప్రాజెక్టు లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల విచారణ, పాజిటివ్, నెగటివ్ ఉత్తర్వుల తయారీ విషయమై అన్ని క్షేత్ర స్థాయి టీమ్ ల ప్రోగ్రెస్ గురించి బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్ మై, రెవెన్యూ అదనపు కలెక్టర్ విక్టర్, కామారెడ్డి, ఎల్లారెడ్డి ఆర్డీవోలు వీణ, ప్రభాకర్, భూ భారతి స్పెషల్ ఆఫీసర్, తహసిల్దార్ లతో సమావేశం నిర్వహించి, దరఖాస్తుల విచారణ, ఉత్తర్వుల తయారీను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.