calender_icon.png 18 May, 2025 | 2:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు

17-05-2025 09:53:16 PM

డీఎస్పీ శ్రీధర్ రెడ్డి, పట్టణ సిఐ శివశంకర్..

కోదాడ: తల్లిదండ్రులు తమ మైనర్‌ పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దని కోదాడ పట్టణ సిఐ శివశంకర్ అన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల ప్రకారం... కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ లో పరిధిలో చేపట్టిన సోమవారం నుండి శనివారం వరకు స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ మైనర్లు వారి తల్లిదండ్రులకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కౌన్సిలింగ్ చేశారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.  మైనర్లకు వాహనాలు ఇస్తే చట్ట పరమైన చర్యలు తప్పవని 45 మంది  మైనర్ వాహనదారులకు వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి మొదటి తప్పుగా భావించి ఒక్కొక్కరికి 1500 చొప్పున ఫైన్ వి దించినట్లు తెలిపారు.

పిల్లలకు వాహనాలు ఇవ్వడం ప్రమాదం, రోడ్డు నిభందనలు, మోటారువాహన చట్టం ప్రకారం మైనర్స్ వాహనాలు నడపడం నిషేదం, మైనర్స్ డ్రైవింగ్ చేస్తూ ఒకసారి పట్టుబడితే వారికి 25 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వడం కుదరదు అని అన్నారు. మైనర్ పట్టుబడితే ఒక సంవత్సరం వరకు వెహికల్ రిజిస్ట్రేషన్ ఆగిపో ప్రమాదం ఉందన్నారు.రోడ్డు భద్రత ప్రమాదాల నివారణలో భాగంగా ప్రభుత్వాలు కఠిన చట్టాలను, నిబంధనలను రూపొందించాయి అన్నారు. డ్రైవింగ్ చేస్తూ మైనర్స్ ఒకసారి పట్టుబడితే వారి వివరాలను రవాణాశాఖవారికి పంపుతాం అని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తు దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులపై చర్యలు ఉంటాయి లైసెన్స్‌ సీజ్ చేయడం, భారీగా జరిమానా విధించడం, జైలుకు పంపడం జరుగుతుందిఅని. పట్టణ ఎస్ఐలు రంజిత్ రెడ్డి, సుధీర్ కుమార్, ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్, ఏఎస్ఐలు షేక్ ఖయ్యూం, శ్రీనివాసులు, రమేష్ పాల్గొన్నారు.