25-12-2025 02:44:44 AM
ముఖ్య అతిథులుగా మహేష్ కుమార్ గౌడ్, ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్, డిసెంబర్24(విజయ క్రాంతి): నిజామాబాద్ తెలంగాణ యునైటెడ్ పాస్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం రఫున నిర్వహించిన గ్రాండ్ క్రిస్మస్ వేడుకల కార్యక్రమం బుధవారం జరిగింది.
నిజామాబాద్ నగరంలోని ఖలీల్వాడి, న్యూ అంబేద్కర్ భవన్లోఘనంగా క్రిస్మస్ వేడుకలు నిర్వహించరు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు, ముఖ్య అతిథులుగా,ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, సేవ భావానికి ప్రతీక అని పేర్కొన్నారు. యేసుక్రీస్తు బోధించిన మానవతా విలువలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. సమాజంలో అన్ని మతాల మధ్య ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆయన ఆకాంక్షించారు. అన్ని మతాలను సమానంగా గౌరవించాలని తెలిపారు.
కుల మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు సామాజికoగా బలమిస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు,క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.