18-10-2025 01:50:05 AM
హైదరాబాద్, అక్టోబర్ 17(విజయక్రాం తి) : తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని క్రికె ట్ నైపుణ్యాన్ని వెలికితీయడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ క్రికెట్ అసోసియేషన్(టీసీఏ) కొత్త గవర్నింగ్ కౌన్సిల్,ఏపెక్స్ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. 2025 మూడేళ్ళ పదవీకాలానికి గానూ ఎన్నికలు జరిగినట్టు టీసీఏ ప్రకటించింది. నూతన గవర్నింగ్ కౌన్సిల్ ఛైర్ పర్సన్‌గా డీకే అరుణ బాధ్యతలు స్వీకరించగా.. టీసీఏ కొత్త ప్రెసిడెంట్‌గా బీబీ పాటిల్ ఎన్నికయ్యారు. ధరం గురువారెడ్డి జనరల్ సెక్రటరీగా కొనసాగనున్నారు.
డా. పీ.విజయ్‌చందర్‌రెడ్డి వైస్ ప్రెసి డెంట్‌గా పదోన్నతి పొందారు. డా.తీగల హ రినాథ్‌రెడ్డి ట్రెజరర్‌గా, ప్రవీణ్ అడ్మాలా జా యింట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు. ప్యాట్రన్స్ బోర్డులో బండి సంజయ్ కుమా ర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎన్.రామచందర్‌రావు,వేదిరే శ్రీరామ్ ఉండగా.. సలహా బోర్డు లో బండారు దత్తాత్రేయ, ఐ.గోపాల్ శర్మ, జస్టిస్(రిటైర్డ్) బీఎస్ రెడ్డి, సాద్ బిన్ జంగ్, జస్టిస్(రిటైర్డ్) సీవీ రాములు, గవర్నింగ్ కౌన్సిల్‌లో ఛైర్ పర్సన్‌గా డీకే ఆరుణ, కో ఛైర్మన్‌గా వై లక్ష్మీనారాయణ, వైస్ ఛైర్మన్‌గా నూనే బాలరాజ్ , సభ్యులుగా మల్క కొమరయ్య, యన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవకి వా సుదేవరావు,జీ శ్రీనివాస్, జీ ప్రేమేందర్‌రెడ్డి, టీ అమర్నాథ్‌రెడ్డి, పి విష్ణువర్థన్‌రెడ్డి, డా ఎం రామ్‌రెడ్డి, డోకూరు పవన్ కుమార్, బి రాధి కా దేవి, డా.ప్రవీణ్ పాలడుగు ఉన్నారు.
మేనేజింగ్ కమిటీలో కల్నల్ ఎ ప్రగతి కుమా ర్, బద్దం మహిపాల్‌రెడ్డి, అంబర్ అబ్బాస్(క్రికెటర్),పీ ఝాన్సీ లక్ష్మి(క్రికెటర్) ఎంపిక య్యారు. జోనల్ కమిటీలో టీ.జయపాల్(ఈస్ట్), పి.నరోత్తం రెడ్డి(నార్త్), సయ్యద్ నయీమ్(వెస్ట్), ఎం.మహేందర్‌రెడ్డి(సెంట్రల్), జీకే ప్రేమ్‌కుమార్(సౌత్) ఉన్నారు. టెక్నికల్ కమిటీలో పర్వేజ్ హసన్ అబ్బాస్, ఎం మౌనిక, చిత్తరంజన్ బెన్నూర్, కోచ్‌ల కమిటీలో పి కృష్ణారెడ్డి, జె.రాజశేఖర్ రెడ్డి, వీ.వినోద, మీడియా కమిటీలో ఈ వరుణ్ రెడ్డి, రవీందర్, బి మణికంఠ, గ్రౌండ్స్ అండ్ టోర్నమెంట్స్ కమిటీలో ఈ వివేకానంద రెడ్డి, అనూష, మోహన్‌రెడ్డి, ఎన్ రాంరెడ్డి, పీ నర్సంగ్‌రావు ఉన్నా రు. 32 జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధిని బలోపేతం చేయడంతో పాటు బీసీసీఐ రాజ్యాంగ విధానాలకు అనుగుణంగా పరిపాలన, సమాన అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని టీసీఐ కొత్త కార్యవర్గం స్పష్టం చేసింది.