18-10-2025 01:48:26 AM
కర్ణాటక ఎమ్మెల్యే పరిశీలకుడు రిజ్వాన్ హర్షద్
డిచ్‌పల్లి, అక్టోబర్ 17 (విజయ క్రాంతి) : కష్టకాలంలో పార్టీని వీడకుండా పట్టుకొని కాంగ్రెస్ పార్టీ కి సేవలందించిన వారికి అధిష్టానం తగిన ప్రాధాన్యత కల్పిస్తుందని కర్ణాటక ఎమ్మెల్యే పరిశీలకుడు రిజ్వాన్ హర్షద్ అన్నారు. నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షని ఎన్నిక కోసం డిచ్పల్లి లో కేఎన్‌ఆర్ గార్డెన్లో సంఘటన్ సృజన్ అభియాన్ బ్లాక్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంనిర్వహించారు. శుక్రవారం పరిశీలనకు వచ్చిన ఏఐ సి సి అబ్జర్వర్ రిజ్వాన్ హర్షద్ కర్ణాటక ఎమ్మెల్యే, బల్మూర్ వెంకట్ నర్సింగ్ రావు ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతకు పెంచేందుకు ప్రతి కార్యకర్త ముందుండి రాబోయే ఎన్నికలను విజయం సాధించడానికి కృషి చేయాలని సూచించారు.
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి కాంగ్రెస్ కార్యకర్తల అభిప్రాయం గ్రామాల వారీగా మండలాల వారిగా బ్లాక్ వారిగా సేకరించడం జరుగుతుందని, పార్టీకి అంకితభావంతో పనిచేసే కార్యకర్త కి అధిష్టానం పట్టం కడుతుందని అభ్యర్థుల పేర్లను ఏఐసిసి పరిశీలనకు పంపుతామని,సోనియా గాంధీ రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకు డిసిసి అధ్యక్షులు నియామకం జరుగుతుందని అన్నారు. బిజెపి పార్టీ పాలన వల్ల ఈ పది సంవత్సరాలలో రైతులకు ఒరిగిందేమీ లేదని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ తహరి బిన్ హందాన్, ఎమ్మెల్సీ బలమూరు వెంకట్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, డిచ్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గంగాధర్, నిజాంబాద్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొలసాని శ్రీనివాస్,ఏఐ సి సి కార్యదర్శి శేఖర్ గౌడ్ , రాంభూపాల్ , మునిపల్లి సాయి రెడ్డి, ధర్పల్లిమాజీ ఎంపీపీ. ఇమ్మడి గోపి పాల్గొన్నారు.