15-12-2025 10:08:18 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్మపల్లిలోని జెడ్పిహెచ్ఎస్ లో ఎస్ఏ-1 పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 6 నుండి 10 తరగతుల విద్యార్థులకు ప్రతి తరగతిలో టాప్ 10 మంది విద్యార్థులకు బిగ్ హెల్ప్-గోల్డెన్ స్టార్ ఆధ్వర్యంలో సోమవారం అవార్డులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం శ్రీదేవి, ఆసంస్థ ఉభయ రాష్ట్రాల సెక్రటరీ, పాఠశాల పీడీ మల్లేష్ మాట్లాడుతూ బిగ్ హెల్ప్ సంస్థ చైర్మన్ షేక్ చాంద్ పాషా సౌజన్యంతో పాఠశాలలో చదువుతున్న తల్లిదండ్రులు లేని 15 మంది విద్యార్థులకు ప్రతినెల వారికి కావలసిన వస్తువులతో పాటు ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ప్రోత్సహిస్తున్న చాంద్ పాషాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థులు దాతల సహకారాన్ని ఉపయోగించుకుని, క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మధుకర్ ,రమేష్,శోభారాణి,సునంద, అంజలి,అశోక్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.