15-12-2025 10:06:14 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మహాత్మా గాంధీ సిద్ధాంతాల ప్రభావంతో భారత స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొని ఉప్పు సత్యాగ్రహంలో,క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న ధీరోదాత్తుడు పొట్టి శ్రీరాములని అర్వపల్లి సర్పంచ్ చిల్లంచర్ల విద్యాసాగర్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా సోమవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢనిశ్చయంతో పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ఆ మహనీయుడి ప్రాణ త్యాగఫలమే నేడు మనకున్న భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మోరిశెట్టి నాగేందర్, దారం శ్రీను, చీదరి సురేష్, ఈగ వెంకటేశ్వర్లు, పోలిశెట్టి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.