calender_icon.png 14 October, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగ ఓట్ల ఆరోపణల్లో బిగ్ ట్విస్ట్

14-10-2025 01:49:32 AM

  1. అది ఇల్లు కాదు.. అపార్ట్‌మెంట్

15 ఫ్లాట్లలో 43 మంది పాత ఓటర్లే

కొత్తగా ఒక్క ఓటూ చేరలేదు

కేటీఆర్ ఆరోపణలు వాస్తవదూరం

హైదరాబాద్ జిల్లా ఎన్నికల కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 13 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ తీవ్ర కలకలం రేపిన ‘ఒకే ఇంట్లో 43 దొంగ ఓట్లు’ వ్యవహారంలో అసలు విష యం తెలిసింది. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ఆరోపణలు వాస్తవ దూరమని, వివాదాస్పద చిరునామాలో ఉన్నది ఒక్క ఇల్లు కాదని, అది 15 ఫ్లాట్లు ఉన్న ఒక అపార్ట్‌మెంట్ అని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వి కర్ణన్ స్పష్టం చేశారు.

సోమవారం ఆయన స్వయంగా మీడియా ప్రతినిధులతో కలిసి ఆ ప్రాంతం లో క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, వాస్తవాలను వెల్లడించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్లను నమోదు చేయిస్తోందని, యూసుఫ్‌గూడ డివిజన్, కృష్ణానగర్‌లోని ఇంటి నెంబర్ 8-3-231/B/160లో ఏకంగా 43 ఓట్లు ఉన్నాయ ని కేటీఆర్ ఆరోపణలు చేశారు. ఈ ఆరో పణలు తీవ్ర దుమారం రేపడంతో, జిల్లా ఎన్నికల యంత్రాంగం తక్షణమే స్పందించి, విచారణ చేపట్టింది.

సోమవారం జిల్లా ఎన్నికల అధికారి కర్ణన్ నేరుగా మీడియా బృం దంతో కలిసి ఆ చిరునామాను సందర్శించారు. పరిశీలనలో ఆ చిరునామాలో ఉన్న ది సంస్కృతి అవెన్యూ అనే అపార్ట్‌మెం ట్ అని తేలింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.. “వివాదాస్పద చిరునామాలో ఉన్న ది ఒక అపార్ట్‌మెంట్. ఇందులో మొత్తం 15 ఫ్లాట్లు ఉన్నాయి. అంటే 15 కుటుంబాలు నివసిస్తున్నాయి.

ఇక్కడ నమోదై ఉన్న 43 మంది ఓటర్లు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే ఈ జాబితాలో ఉన్నారు. వారంతా గత అసెంబ్లీ, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల ఈ చిరునామాలో కొ త్తగా ఒక్క ఓటు కూడా నమోదు కాలేదు. కాబట్టి, ఇక్కడ దొంగ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు సరికాదు” అని కర్ణన్ స్పష్టత ఇచ్చారు.