calender_icon.png 14 October, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. 25 లక్షల నగదు పట్టివేత

14-10-2025 01:46:30 AM

స్వాధీనం చేసుకున్న ఎస్‌ఎస్‌టీ బృందం

హైదరాబాద్,సిటీ బ్యూరో అక్టోబర్ 13 (విజయక్రాంతి) : జూబ్లీహిల్స్ అసెంబ్లీ ని యోజకవర్గ ఉపఎన్నిక నేపథ్యంలో ఎన్నికల అధికారులు నిఘాను పటిష్టం చేశారు. ఇం దులో భాగంగా, సోమవారం చేపట్టిన తనిఖీలలో సరైన పత్రాలు లేకుండా నిబంధనల కు విరుద్ధంగా తరలిస్తున్న 25 లక్షల నగదు ను స్టాటిక్ సర్వులైన్స్ టీమ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఉప ఎన్నిక నేపథ్యంలో మైత్రీవనం ఎక్స్ రోడ్ వద్ద, సారధి స్టూడియో సమీపంలో స్టాటిక్ సర్వులైన్స్ టీమ్ బృందం వాహన తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో యూసుఫ్‌గూడ వైపు ప్రయాణిస్తున్న కారును ఆపి తనిఖీ చేయగా, అందులో  25 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తిని విశా ఖపట్నం జిల్లా, సీతమ్మధరకు చెందిన జై రాం తలాసియాగా గుర్తించారు.

ఇంత భారీ మొత్తంలో నగదును తరలించడానికి గల కారణాలను, సరైన పత్రాలను ఆయన అధికారులకు చూపించలేకపోయాడు. దీంతో, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం స్వాధీనం చేసుకున్న నగదును మధురానగర్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గంలో తనిఖీలను మరింత కట్టుదిట్టం చేశామని అధికారులు వెల్లడించారు.