24-11-2025 12:18:10 AM
చేగుంట, నవంబర్ 23 :చేగుంట మండలంలోని చేగుంట, వడియారం, చందా యిపెట్, పెద్ద శివనూర్, పొలంపల్లి, ఇబ్రహీంపూర్ గ్రామాలతో పాటు వివిధ గ్రా మాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమాన్ని అధికా రులు, కాంగ్రెస్ నాయకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ మహిళా శక్తి సంబరాల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్ద పీట వేస్తుందని తెలిపారు.
సంక్షేమ పథకాలు అందని వారు డిసెంబర్ 1నుండి 9వరకు జరిగే ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్ర మంలో స్థానిక తహసిల్దార్ శివప్రసాద్, ఎం పీడీవో చిన్నరెడ్డి, మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, పిఏసిఎస్ చైర్మన్ అయిత రఘరాములు, కాంగ్రెస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.