29-12-2025 02:30:41 AM
తల్లిదండ్రులను భయపెట్టబోయి.. స్లాబ్‌కు వేలాడుతున్న చీర మెడకు బిగింపు
ప్రమాదవశాత్తు గొంతుకు బిసుకుని మృతి
మహబూబ్‌నగర్ జిల్లా చిల్వేర్ గ్రామంలో ఘటన
మహబూబ్‌నగర్, డిసెంబర్ 28 (విజయక్రాంత): పతంగి ఓ బాలుడి ప్రాణం తీసింది. పతంగి కొనివ్వలేదని తల్లిదండ్రులను భయపెట్టించబోయి స్లాబుకు వేలాడు తున్న చీరను మెడలో చుట్టుకోగా.. ప్రమాదవశాత్తు బిగియడంతో మృతిచెందాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మం డలం చిల్వేర్ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన జక్క రాజు కుమారుడు జక్క సిద్ధార్థ (9). గాలిపటం కొనివ్వడంలేదని మారం చేసి.. ఇంటి స్లాబ్ నుంచి కిందకు వేలాడుతున్న చీరను మెడకు చుట్టుకున్నాడు. మారం చేస్తున్నాడని తల్లిదండ్రులు కూడా పట్టించుకోలేదు. ఇంతలో చీర ఒక్కసారిగా గొంతుకు బిగుసుకుపోవడంతో అక్కడిక్కడే మృతిచెందాడు.