calender_icon.png 30 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రేమ ఆ చూపుతో మొదలైంది

30-09-2025 01:26:59 AM

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా నటించిన చిత్రం ‘శశివదనే’. ఈ సినిమాకు సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించారు. ఏజీ ఫిల్మ్స్ కంపెనీ, ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్స్‌పై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల నిర్మిస్తున్నారు. అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ సోమవారం విడుదల చేశారు. ట్రైలర్‌ను గమనిస్తే.. ‘గలగల పారే గోదావరి గట్టుతో కళకళలాడే అందమైన పల్లెటూరులో ఓ అమ్మాయిని చూడగానే తొలిచూపులోనే అబ్బాయికి ప్రేమ పుడుతుంది. ప్రేమ ఆ చూపుతో మొదలైంది..

కాలం బొమ్మలా ఆగిపోయింది. ఆమెతో పాటే నా మనసు కూడా మాయమైంది’ అనే డైలాగ్ హీరోయిన్‌ను హీరో ఎంత గాఢంగా ప్రేమిస్తున్నాడో తెలియజేస్తోంది. ‘ప్రేమించాలని డిసైడ్ అయితే ఎన్నొచ్చినా యుద్ధం చేయాల్సిందే’ అని హీరోకు తండ్రి చెప్పటం చూస్తే ప్రేమలో హీరోకు ఎదురైన సమస్య గురించి తెలుస్తుంది.  ఈ చిత్రానికి సంగీతం: శరవణ వాసుదేవన్; నేపథ్య సంగీతం: అనుదీప్ దేవ్; కెమెరా: శ్రీసాయికుమార్ దారా; ఎడిటింగ్: గ్యారీ బీహెచ్.