calender_icon.png 30 September, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షాకైపోయేలా..

30-09-2025 01:25:50 AM

ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న చిత్రం ‘రాజాసాబ్’.  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ కోసం రెబల్ ఫ్యాన్స్‌తోపాటు సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అభిమానుల ఎదురుచూ పులకు తెర దించుతూ టీమ్ సోమవారం ట్రైలర్‌ను వదిలింది.

‘అబీ దేఖ్ లీజీయే..’ అంటూ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు రాజాసాబ్‌గా ఓ విలాసవంతమైన భవనంలో అడుగుపెడతాడు ప్రభాస్. ట్రైలర్‌లో హారర్ ఎలిమెంట్స్‌తోపాటు హీరోయిన్లతో కలిసి ప్రభాస్ పంచిన వినోదం, రొమాంటిక్ సన్నివేశాలు మరింతగా ఆకట్టుకుంటాయి. ‘చంపేశాడు బాబోయ్..’ అనే డైలాగ్ స్టన్నింగ్‌గా ఉంది. ‘ఏదో గుర్తుండిపోయే పనిచేయాలి..

సంచలనమైపోవాలి.. ఏంట్రా ఇలాంటి పనిచేశాడని అందరూ షాకైపోవాలి..’ వంటి డైలాగు లు ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈ సినిమా వచ్చే సంక్రాంతి పండక్కి జనవరి 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్; సినిమాటోగ్రఫీ: కార్తీక్ పళని; ఫైట్స్: రామ్ సోలొమన్; ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వరరావు.