calender_icon.png 30 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరో 4 రోజులు వర్షాలు

30-09-2025 01:27:08 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): రాష్ట్ర వ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటువర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈమేరకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ని జామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మ హబూబాబాద్, వరంగల్, హన్మకొండ, రం గారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వి కారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వా ల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశముంది. బుధ, గురు, శుక్రవారాల్లోనూ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది.