19-11-2025 08:05:07 PM
* ఇందిరమ్మ స్పూర్తితో ప్రభుత్వ పథకాల అమలు
* టీపీసీసీ ఛైర్మన్ మహేశ్ కుమార్ గౌడ్
* అచ్చంపేటలో ఇందిరమ్మ విగ్రహానికి నివాళులు
అచ్చంపేట: దేశానికి స్వాతంత్య్ర తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ, నెహ్రూ ఆనవాళ్లను తొలగించేలా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ పీసీసీ ఛైర్మన్ మహేశ్ కుమార్ గౌడ్ ధ్వమెత్తారు. దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లిన ఘనత కాంగ్రెస్ కే దక్కిందని కొనియాడారు. బుధవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద మాజీ ప్రధాని ఇందిరగాంధీ జయంతి ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే డా.వంశీకృష్ణతో కలిసి పూలమాలతో నివాళులర్పించారు.
ప్రపంచంలో ఉక్కుమనిషి ఖ్యాతి కొందరికే ఉందని, అందులోనూ ఇందిరగాంధీకి దక్కడం దేశానికే గర్వకారణమని ప్రశంసించారు. ఆమె లమలు చేసిన వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఇందిరగాంధీ స్పూర్తితోనే రాష్ర్టంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పోరాటంతో ఏర్పడిన ప్రత్యేక తెలంగాణ.. సోనియాగాంధీతో సాధ్యమైందని అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని అప్పలు పాలు చేశారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రెండేళ్లలోనే ఎన్నో అభివృద్ధి పనులు చేశారని తెలిపారు. ఇప్పటికే 70 వేలకు పైచిలుకు ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు.
ఓటు చోరీతో గద్దెనెక్కుతున్న బీజేపీ
కేంద్రంలో బీజేపీ అనేక రాష్ట్రాల్లో ఓటు చోరీతో గద్దెనెక్కుతోందని ఆరోపించారు. దాని గురించి పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సాకాలతో బహిర్గతం చేసినా.. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. స్వయంప్రతిపత్తి సంస్థలైన ఈడీ, సీబీఐ, ఎన్నికల సంఘాలను ప్రధాని, హోంమంత్రి తమకు నచ్చినట్లుగా వినియోగించుకొని.. ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. యువత, దేశ ప్రజలు మేల్కొని కేంద్రం విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. నెహ్రూ కుటుంబం పదవులు, ఆస్తులు, ప్రాణాలను సైతం త్యాగం చేశారని అన్నారు.
రెండేళ్లలోనే ఎంతో అభివృద్ధి: ఎమ్మెల్యే
రెండేళ్లలోనే తమ ప్రభుత్వం అనేక సంక్షేమ, అభివృద్ధి పనులను చేపట్టిందని ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ తెలిపారు. సీఎం సహకారంతో నియోజకవర్గంలో అనేక పనులు చేపట్టామని అన్నారు. పూర్తి వివరాలను డిసెంబర్ 7న మీడియా సమక్షంలో వెళ్లడిస్తానని అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా ఛైర్మన్ రాజేందర్, పుర ఛైర్మన్ శ్రీనువాసులు, శ్రీ ఉమమామేశ్వర ఆలయ ఛైర్మన్ భీరం మాధవరెడ్డి, నేతలు మల్లికార్జున్, రఫీ, నర్సయ్య, రామనాథం, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.