calender_icon.png 19 November, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

19-11-2025 08:06:48 PM

చండూరు (విజయక్రాంతి): మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 108వ జయంతిని పురస్కరించుకుని బుధవారం మున్సిపల్ పట్టణంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అనంత చంద్రశేఖర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నేతలు, ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ నిర్మాణంలో సామాజిక న్యాయ సాధనలో, పేదల సంక్షేమంలో ఇందిరాగాంధీ పాత్ర మరువలేనిదని గుర్తుచేశారు.

ఆమె పాలనలో చూపిన ధైర్యం, దూరదృష్టి, నాయకత్వం నేటికీ దేశానికి ప్రేరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ వైస్ చైర్మన్ ధోటి సుజాత వెంకటేష్ యాదవ్, మాజీ సర్పంచ్, నల్లగంటి మల్లేశం, మంచుకొండ సంజయ్, కారింగు రామ్మూర్తి, కల్లెట్ల మారయ్య, పన్నాల లింగయ్య, గండూరి జనార్ధన్, భూతరాజు దశరథ, ఐత రాజు మల్లేష్, దశరథ, ఇరిగి వెంకటేశం, దోటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.