05-05-2025 10:26:08 PM
కోదాడ: అఖిల భారత యువజన సమైఖ్య ఏఐవైఎఫ్ చిలుకూరు మండల అధ్యక్షుడు అనంతుల రాము-ఉష దంపతుల కుమార్తె చిన్వితశ్రీ 10వ జన్మదిన వేడుకలను కోదాడలో ఉన్న అనాధాశ్రమంలో సోమవారం ఘనంగా జరుపుకున్నారు. చిన్వితశ్రీ జన్మదినం సందర్భంగా అనాధలకు, పేదలకు సేవ చేయాలనే సదుద్దేశంతో అన్నదానం కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అనాధశ్రమంలో కేక్ కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. అనాధశ్రమంలో పిల్లలకు అన్నదానం చేయడం ఎంతో సంతృప్తి ఇచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో అనంతుల కౌసల్య, అనాధాశ్రమం సిబ్బంది చిన్నారులు ఉన్నారు.