29-01-2026 12:00:00 AM
ముత్తారం, జనవరి28 (విజయక్రాంతి): ముత్తారం మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ ను రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు నిర్మించనున్నారు.ఈ సందర్భంగా మైదంబండ సర్పంచ్ బియ్యని శివ కుమార్ మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీనుబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే, తన నియామకానికి సహకరించిన జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చొప్పరి సదానందంకు మండల పార్టీ అధ్యక్షులుదొడ్డ బాలాజీకు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మద్దెల రాజయ్య, ఏఎంసీ డైరెక్టర్ లు బోల్నేని బుచ్చం రావు, జాగిరి సమ్మయ్య, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు వాజిద్ పాషా, బీసీ సెల్ మండల అధ్యక్షులు అల్లం కుమారస్వామి, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు గాదం శ్రీనివాస్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడవెన సంపత్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గోవిందుల పద్మ, సర్పంచ్ లు చిలివేరి జ్యోతి లక్ష్మణ్, మెంగని సమత తిరుపతి, పెగుడ తిరుమల కుమార్,రాపెల్లి రాజయ్య, బొంతల అన్నపూర్ణ ఉపేందర్, గడ్డం రాజేశం, చొప్పరి సంపత్,తాని ప్రభాకర్, ఇండ్ల కృష్ణవేణి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.