calender_icon.png 31 October, 2025 | 4:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అజారుద్దీన్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్ర

31-10-2025 12:28:19 AM

మైనార్టీ వ్యక్తిని మంత్రివర్గంలో తీసుకుంటే అడ్డుకోవడమేంటీ..? 

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్ గెలిచేందుకు బీజేపీ ప్రయత్నం 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి) : క్రికెటర్ అజారుద్దీన్‌పై బీజేపీ, బీఆర్‌ఎస్ కలిసి కుట్ర చేస్తున్నాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. గురువారం ఆయన గాంధీభవ న్‌లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, పార్టీ నేతలు చరణ్‌కౌసిక్ యాదవ్, గజ్జ భాస్కర్ యాదవ్ తదితురులతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ తెర వెనుక బంధం గురించి ఇప్పటికే కల్వకుంట్ల కవిత స్పష్టం చేసిందని తెలిపారు.

గతంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ సహకారంతోనే బీజేపీ రాష్టంలో 8 సీట్లు గెలుచుకుందని, ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో తమకు గెలిచే అవకాశం లేదని, బీఆర్‌ఎస్‌కు లాభం చేయడం కోసం చాలా లేట్‌గా బలహీనమైన అభ్యర్థిని ప్రకటించింది’ అని విమర్శించారు. అజారుద్దీన్‌తో ప్రమాణ స్వీకారం చేయించకుండా రాష్ర్ట గవర్నర్‌పైన బీజేపీ ఒత్తిడి తీసుకువచ్చిందన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలో భాగం గానే ఎన్నికల  కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసిందని ఆరోపించారు.

రాజస్థాన్‌లో ఇవ్వలేదా..?

గతంలో రాజస్థాన్‌లో ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి సురేంద్రపాల్‌సింగ్‌ను మంత్రి వర్గంలోకి తీసుకున్న విషయం గుర్తుంచుకోవాలని డిప్యూటీ సీఎం హిత వు పలికారు. ఉప ఎన్నికకు 20 రోజుల ముందే మంత్రివర్గంలోకి తీసుకున్నారని, బీజేపీ ద్వంద్వ ప్రమాణాలకు ఇది నిదర్శనమన్నారు. అజారుద్దీన్  కేవలం మైనార్టీ అన్న ద్వేషంతోనే బీజేపీ ప్రమాణస్వీకారాన్ని అడ్డుకుంటోందన్నారు. 

ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తం

రాష్ర్ట మంత్రుల మధ్య స్పష్టమైన అవగాహన, ఆలోచన, ప్రణాళిక నిర్ణయాల పట్ల నిబద్ధత ఉన్నాయని భట్టి వివరించారు.  తుఫాను నష్టంపై ప్రభుత్వం అత్యంత మానవీయ కోణంలో ఆలోచన చేస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు యావత్ క్యాబినెట్, చీఫ్ సెక్రటరీతో పాటు మొత్తం యంత్రాంగం అప్రమత్తమై కావలసిన చర్యలు చేపట్టిందన్నారు. ప్రభుత్వ ముందస్తు చర్యల మూ లంగా భారీ ప్రాణ, ఆస్తి, ఇతర నష్టం జరగకుండా చూడగలిగామని భట్టి పేర్కొన్నారు.