29-08-2025 01:43:08 AM
జనగామ, ఆగస్టు 28 (విజయ క్రాంతి) పట్టణ కేంద్రంలో సుందరీకరణలో గిరిజన మహానీయుడు జా టోత్ తాను నాయక్ విగ్రహం ఏర్పా టు చేయాలని సేవాలాల్ సేన డి మాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ మా ట్లాడుతూ.. జనగామ పట్టణ అభి వృద్ధిలో గిరిజన మహానీయుల గుర్తింపు అనివార్యం. జాటోత్ తాను నాయక్ విగ్రహం యువతకు స్ఫూ ర్తిగా నిలుస్తుందన్నారు.
పట్టణంలో జరుగుతున్న సుందరీకరణ, అభి వృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ జిల్లా వాసులైన మహానీయులు సర్వాయి పాపన్నగౌడ్, దొడ్డి కొము రయ్య, చాకలి ఐలమ్మ విగ్రహాలు ఇప్పటికే ఏర్పాటు చేయబడుతు న్నట్లు తెలుసుకున్నాం. జిల్లాకు చెం దిన గిరిజన సామాజిక వర్గపు మహా నీయుడు, తెలంగాణ సాయుధ పో రాటంలో భూమి, భుక్తి, వెట్టి చాకిరి నిర్మూలన కోసం తన ప్రాణా లను అర్పించిన జాటోత్ తాను నాయక్ విగ్రహం కూడా ఈ సుందరీకరణ ప్రణాళికలో భాగంగా ప్రధాన స్థలం లో ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సేవాలాల్ సేన వినతిపత్రం అందజేశారు.
జాటోత్ తాను నాయ క్ గిరిజన ఉద్యమానికి అగ్రగామి నాయకుడిగా, నేటి యువతకు ప్రేరణగా నిలిచిన మహానీయుడని, విగ్ర హం ఏర్పాటు ద్వారా గిరిజనుల చరిత్రకు గౌరవం చేకూరుతుందని సేవా లాల్ సేన నాయకులు తెలిపారు. సేవలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు బానోత్ మహేందర్. జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ బిక్షపతి, కొర్ర రం గయ్య భూక్యరాజు నాయక్ జిల్లా ఆర్గనైజ్ సెక్రెటరీ డి. ప్రకాష్ , చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ బి. భిక్షపతి కార్యదర్శి జితేందర్ పాల్గొన్నారు.