30-08-2025 01:14:24 AM
పినపాక, ఆగస్టు 29, (విజయక్రాంతి):పినపాక మండలం జానంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఆగస్టు 29 సందర్భంగా జాతీయ క్రీడా ,తెలుగు భాష దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఆ ధ్వర్యంలో మేజర్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.
తదనంతరం విద్యార్దులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి మాట్లాడు తూ భారతదేశానికి మొట్టమొదటి సారిగా ఒలంపిక్స్ క్రీడారంగంలో హాకీ క్రీడలో మూ డుసార్లు స్వర్ణ పథకాన్ని సాధించి పెట్టిన మొట్టమొదటి భారతీయుడు మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా జీవితం గురించి వివరించారు. క్రీడలు శారీరక ఆరోగ్యంతో పాటుగా,మానసికస్థితిని మెరుగు పరచడమే కాకుండా క్ర మశిక్షణ ,పట్టుదల, నాయకత్వ వంటి లక్షణాలను పెంపొందిస్తాయి కావున క్రీడలపట్ల ఆసక్తి కనపరచాలన్నారు. తెలుగు బాష సస్యశ్యామలమైనది. దేశ బాషలందు తెలుగు లెస్స అనే నానుడిని మరిచిపోరాదన్నారు. ఎన్ని భాషలు నేర్చిన తెలుగు భాషను మర్చిపోరాదని విద్యార్దులకు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.