18-08-2025 01:26:18 AM
హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడి స మస్యలు అక్కడే తిష్ట వేశాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 21 నుంచి 25 వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ర్యాలీలు నిర్వహించనుంది. ఈ మేరకు ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు అధ్యక్షతన జరి గిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం అవ్వడమే లక్ష్యంగా ఈ మావేశం జరిగింది. ఇప్పటికే జిల్లా వర్క్‌షాప్‌లు, రాష్ర్ట వర్క్‌షాప్ అయిన వెంటనే 31 జిల్లాలకు సంబంధించిన స్థానిక సంస్థల ఎన్నికల త యారీకి సంబంధించిన వర్క్‌షాప్‌ల ఫలితాలను ఈ సమావేశంలో విశ్లేషించారు.
566 మండలాలకు సంబంధించి జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఎక్కడ జరుగుతున్నాయో వాటికి సంబంధించిన వర్క్‌షాప్‌లు కూడా పూర్తయ్యాయని.. వాటిలో పలుచోట్ల లోపాలను గుర్తించినట్లు సమాచారం. మహాసం పర్క్ అభియాన్ పేరుతో ఇంటింటికీ బీజేపీ గడప గడపకు పోలింగ్ బూత్ అధ్యక్షుడు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించినట్లు సమావేశంలో నేతలు అధ్యక్షుని దృష్టికి తీసుకుపోయారు. ప్రజలకు చేరువ అవ్వడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యారనే అం శంపైనా విశ్లేషించారు. అనంతరం తదుపరి కార్యాచరణ కూడా నిర్ణయించారు.
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలపై పోరు
స్థానిక సంస్థలను గత బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ఏ విధంగా నాశనం చేశాయో వివరించేలా ర్యాలీలతో పోరు సాగిస్తామని బీజే పీ నేతలు తెలిపారు. ఈ నెల 21 నుంచి 25 వరకు స్థానిక సమస్యలను ప్రజలకు తెలియజేయడం కోసం, కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థలను ఎలా నిర్వీ ర్యం చేశాయో వివరిస్తూ మొత్తం 566 మం డలాలలో ర్యాలీలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ ర్యాలీల అనంతరం సమస్యలపై స్థానికంగా తహసీల్దార్‌లకు వినతిప త్రాలు అందజేయాలని దిశానిర్దేశం చేశారు.
ఈ ఆందోళన కార్యక్రమంలో గ్రామాల్లో ప్ర జలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, నిధు ల లేమితో కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్‌ఎస్ ప్ర భుత్వం గ్రామపంచాయతీలను ఎలా ఇబ్బందిపెట్టాయో ఈ ఉద్యమం ద్వారా ప్రజలకు తెలియజేస్తామని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు.
26 నుంచి జిల్లా కేంద్రాలలో ర్యాలీలు
మండలాల్లో ర్యాలీలు పూర్తయ్యాక ఈ నెల 26 నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు అన్ని జిల్లా కేంద్రాలలో ర్యాలీలు నిర్వహిస్తారు. ఆ సందర్భంగా జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేస్తారు. జిల్లాల్లో ఉన్న ప్రధాన సమస్యలను ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తారు. ఈ ర్యాలీల ద్వారా స్థానిక సమస్యలపై ప్రభుత్వాన్ని మేల్కొల్పడం, ప్రజలకు ఈ ప్రభుత్వా లు ఎలా మోసం చేశాయో వివరించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కాసం వెల్లడించారు.
24 గంటల టూర్
ఈ నెల 21, 22 తేదీలలో “24 గంటల టూర్” కార్యక్రమం ద్వారా రాష్ర్ట అధ్యక్షులు ఎన్ రాంచందర్‌రావు రంగారెడ్డి జిల్లాలోని ఒక మండలంలో 24 గంటలు బస చేస్తారు. ఆ మండలంలోని ప్రతి గ్రామంలో యువ సమ్మేళనం, మహిళా సమ్మేళనం, పూర్వ అధ్యక్షుల సమ్మేళనం, రచ్చబండ వంటి కార్యక్రమాలలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో రాష్ర్ట, జాతీయ, జిల్లా నాయకులు అందరూ 24 గంటలు బస చేస్తారు. అక్కడి సమస్యలను తెలుసుకుంటారు. అలాగే రాబోయే జూబ్లీహిల్స్ ఎన్నికలకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.