calender_icon.png 4 August, 2025 | 8:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీకి ప్రజాస్వామ్యమంటే విలువ లేదు

04-08-2025 01:41:30 AM

  1. బీహార్‌లో 6 లక్షల ఓట్లు గల్లంతు
  2. కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ 
  3. రాబోయే ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ అధికారంలోకి
  4. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 
  5. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో జనహిత పాదయాత్ర
  6. మంత్రులు జూపల్లి, సీతక్క, ఎమ్మెల్యేలు హాజరు

నిర్మల్, ఆగస్టు 3 (విజయక్రాంతి)/ఖానాపూర్: దేశంలో అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజాస్వామ్యం అంటే విలువ లేదని ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ విమర్శించారు. బీహార్ రాష్ట్రంలో ఆరు లక్షల ఓటర్లను తొలగించారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాద యాత్ర ఆదివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో కొనసాగింది.

నిజామాబాద్ జిల్లా ఆ ర్మూర్ నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దు అయి న బాదలకుర్తి వంతెనపైకి సాయంత్రం ఐదు గంటలకు చేరుకున్న మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు  జి ల్లా నేతలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. బోధనకుర్తి నుంచి ప్రారంభమైన పాదయా త్ర సుర్జాపూర్ మస్కాపూర్ మీదుగా ఖానాపూర్ పట్టణంలో ప్రవేశించింది. పట్టణం లోని పలు వీధుల్లో సుమారు 7 కిలోమీట ర్లు కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేశారు.

బా ధనుకుర్తి వద్ద శివాలయాన్ని సందర్శించా రు. నటరాజనం బుద్ధుడు బోధించిన ప్రదేశాన్ని సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు. తుల్జాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెం డాను ఆవిష్కరించారు. ఖానాపూర్ బస్టాండ్ వద్ద నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ.. ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పాదయాత్రలు నిర్వహిస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా 3,500 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వ హించారని చెప్పారు. దేశంలో ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా తెలుసుకోవడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ అట్టడుగు వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా అనేక పథకాలను అమలు చేసిందని, ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఆరు గ్యారంటీలను అమలుచేసి దేశానికి రోల్‌మోడల్‌గా నిలిచిందన్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటే దాన్ని బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జల్, జంగల్, జమీన్ ఈ ప్రాంత ప్రత్యేకతని, ఇక్కడి గిరిజనులు, ఆదివాసులు అభివృద్ధి చెందేందుకు కృషి చేస్తామన్నారు. 

100 సీట్లతో అధికారం: మహేశ్‌కుమార్ 

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాటిని అమలు చేసి నిరూపించామని, వచ్చే ఎన్నికల్లో తిరిగి 100 సీట్లతో రాష్ర్టంలో అధికారం దక్కబోతుందని అన్నారు. రాష్ర్టంలో అధికారంలో ఉండి కూడా కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర చేస్తుంటే దాన్ని జీర్ణించుకోలేని బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని ధ్వజ మెత్తారు.

జనం కష్టాలను తెలుసుకొని వాటిని దూరం చేసేందుకు జనహిత పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనికి జనం కూ డా బ్రహ్మరథ పడుతున్నారని పేర్కొన్నారు. కులగలను చేపట్టి జనాభా ప్రతిపాదికన బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపామని చెప్పారు. బీసీలు 56శాతం, ఎస్సీలు 15శాతం, ఎస్టీలు 10 శాతం ఉన్నారని వారి ఆశీర్వాదం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న విషయం మర్చిపోమన్నారు.

బీసీ రిజర్వేషన్లపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆ పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావు కించపరస్తు మాట్లాడుతున్నారని దీనికి నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి, ఎంపీ నాగే ష్, జిల్లా ఎమ్మెల్యేలు ఏం సమాధానం చెపుతారని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఒక్క రూపా యి కూడా సాయం చేయని కేంద్రం.. రా ష్ర్టం అభివృద్ధి చేస్తున్న తమ ప్రభుత్వంపై వి మర్శలు చేస్తే ప్రజలు క్షమించరన్నారు. 

వాటాల కోసమే బీఆర్‌ఎస్‌లో లొల్లి

పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ పార్టీ పని అయిపోయిందని, ఆ పార్టీ త్వరలో కనుమరుగుకానుందని మహేశ్‌కుమార్‌గౌడ్ చెప్పా రు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్, హరీశ్‌రావు, కవి త, కేసీఆర్ నాలుగు గ్రూపులుగా విడిపోయారని దీనికి ప్రధాన కారణం అధికారంలో ఉన్నప్పుడు దోచుకున్న సంపాదన దాచుకునేందుకు వాటాల్లో తేడా రావడమే అని ఆరోపించారు.

రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతతో ముందుకు వెళ్లడం వల్లనే ప్రతిపక్షాలకు మింగుడు పడడం లేదని రాజకీయ పదం కోసం అని ఆరోపించారు. ప్రజల కో సం పనిచేసే ప్రభుత్వానికి ప్రజలు ఆశీర్వాదా లు ఇవ్వాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి పని చేసే కార్యకర్తలకు అవ కాశం కల్పిస్తామని ఆయన భరోసా ఇచ్చా రు.

ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే బొ జ్జు పటేల్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, ఇంద్రకరణ్‌రెడ్డి, బీసీ అధ్యక్షుడు శ్రీహ రిరావు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేతలు విఠల్‌రెడ్డి, ఆత్రం సుక్కు, సోయం బాపురా వు, రేఖశ్యామ్ నాయక్, నారాయణరావు ప టేల్, ఆత్రం సుగుణ, ఆడే గజేందర్, కంది శ్రీనివాస్ రెడ్డి, ఎంబడి రాజేశ్వర్ పాల్గొన్నారు.