calender_icon.png 13 October, 2025 | 3:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం

13-10-2025 01:11:58 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ రూరల్,అక్టోబర్ 13: రానున్న ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి రావడం ఖాయమని మహబూబ్నగర్ ఎంపీడీకే అరుణ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ రూరల్ మండలం ఫతేపూర్ గ్రామానికి చెందిన 100 మంది యువకులు ఆదివారం  మహబుబ్ నగర్ లోని  ఎంపీ క్యాంపు కార్యాలయంలో మండల అధ్యక్షుడు బొంగు గంగన్న అధ్యక్షతన పార్టీలో చేరడం చేరారు.

ఈ సందర్బంగా ఎంపీ  డీకే అరుణమ్మ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో  రానున్న రోజుల్లో అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా ఉంది అంటే ఒక బీజేపీ కే అవకాశం ఉందన్నారు.  గ్రామాల అభివృద్ధి ఒక బీజేపీతోనే సాధ్యపడుతుందని గ్రామీణ ప్రాంత యువత నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారని అన్నారు.

గ్రామపంచాయతీ ఎన్నికలు ఎప్పుడు వచ్చిన అత్యధికంగా బిజెపి అభ్యర్థులను గెలిపించుకొని గ్రామ అభివృద్ధికి తోడ్పాటు నివ్వాలని  కోరారు. భవిష్యత్తు రాజకీయాలు యువత కీలకపాత్ర ఉంటుందని ఎంపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో   జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా బిసి మొర్చ అధ్యక్షుడు యాదయ్య , పార్లమెంట్ మీడియా కన్వీనర్ కోస్గి సతీష్ కుమార్, మండల అధ్యక్షులు బొంగు గంగన్న, మాజీ మండల అధ్యక్షుడు కోడూరు తాజా మాజీ ఎంపీటీసీ  రాజు గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర గౌడ్,   తదితరులు పాల్గొన్నారు.