03-01-2026 08:50:58 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ మున్సిపాలిటి ముసాయిదా ఓటర్ లిష్టు తప్పల తడకగా ఉందని బిజెపి నాయకులు నిర్మల్ మున్సిపల్ కమిషనర్ కు విన్నవించారు. గ్రామాలలోని ఓరట్లను నిర్మల్ వార్డులలో చేర్చడం, ఆ వార్డుకి సంబంధం లేని ఓ వర్గం వ్యక్తుల ఓట్లను హిందు మెజారిటి వార్డులలో అక్రమంగా చేర్చడం జరిగిందని వీటిని వెంటనే తొలగించాలి.
ఈ రోజు నిర్మల్ మున్సిపల్ కమీషనర్ ని కలిసిన నిర్మల్ జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు శ్రీ అంజు కుమార్ రెడ్డి, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి సామ రాజేశ్వర్ రెడ్డి, అసెంబ్లి కన్నవర్ శ్రీ గాదె విలాస్, కమీషనర్ వెంటనే స్పందించి గతంలో 2019 లో ఉన్న మున్సిపల్ ఓటర్ లిష్ట్ ని పరిశిలిస్తూ తప్పులను సరిదిద్దుతున్నామని, త్వరలో కొత్త లిష్ట్ లో అన్ని సవరణలు జరుగుతాయని హామీ ఇవ్వడం జరిగింది.