19-09-2025 12:26:57 AM
నాగల్గిద్ద,సెప్టెంబర్ 18: నాగల్గిద్ద గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో, అంబేద్కర్, మహాత్మ బసవేశ్వరుని విగ్రహాల దగ్గర స్వచ్చత భారత్ కార్యక్రమాన్ని మం డల బీజేపీ నాయకులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా కార్యదర్శి అరుణ్రాజ్ శేరికార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రాజశేఖర్ పాటిల్, బీజేవైఎం మండల అధ్యక్షులు రమేష్, నాగశెట్టి పాటిల్, గడ్డే కాశీనాథ్ పాల్గొన్నారు.