19-09-2025 12:27:20 AM
కల్వకుర్తి సెప్టెంబర్ 18 : కల్వకుర్తి పట్టణ పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు అ క్రమాలకు పాల్పడుతూ ప్లాట్ల అమ్మకాల పేరుతో అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు. సోమశిల సిద్దేశ్వరం తీగల వంతెన, జాతీయ రహదారి నిర్మాణం జరుగుతుండడంతో ఈ ప్రాంత భూముల విలువలు అమాంతం పెరిగాయి.
దీంతో అధికారులను మచ్చిక చేసుకుని ప్రభుత్వ ని బంధనలకు విరుద్ధంగా సాగు భూముల్లో వెంచర్లు నిర్మించి భారీగా సొమ్ము చేసుకుంటున్నా రు.ఎలాంటి సౌకర్యాలు లేకున్నా రంగురంగుల బ్రోచర్లు ముద్రించి ఆకాశపు హరివిల్లు లాగా ప్రచారం చేసుకొని లక్షల రూపాయల ధర నిర్ణయించి అమాయక ప్రజలకు నట్టేటా ముంచేస్తున్నారు.
పాలకుల పలుకుబడి అధికారుల అండదండలు ఉండటంతో అనుమతి కొంత తీసుకొని అధిక విస్తీర్ణంలోవెంచర్లను ఏర్పాటు చేస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అనుమతి పొందే సమయంలో 10శాతం భూమిని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉండగా అది నామ మాత్రం గానేచేస్తున్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన వెంచర్లలో 10 శాతం భూమి చూ పించి అనుమతులు వచ్చాక ఆ స్థలాన్ని కూడా ప్లాట్లుగా మలిచి సొమ్ము చేసుకున్నట్లు బాహాటంగా చర్చించుకుంటున్నారు. తీరా కొనుగోలు చేసిన వ్యక్తులకు ఇంటి నిర్మాణ అనుమతులు అందకమోసపోయామని లబోదిబోమంటున్నారు.
రికార్డులన్నీ కనుమరు..!
కల్వకుర్తి మున్సిపాలిటీ ఏర్పడే సమయం కంటే ముందు సుమారు 20 వెంచర్లకు పైగా ఏర్పాటు చేశారు. వాటికి సంబంధించిన రికార్డులు పూర్తిగా కనుమరుగయ్యాయని చర్చ జరుగుతోంది. దాంతో ఆ వెంచర్లలోని ప్రభుత్వ స్థలాలు గుర్తించలేని విధంగా మారింది. మున్సిపాలి టీ నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చాక వెంచర్ అనుమతి పొందాలంటే నిబంధన ప్రకారం 10 శాతం భూమిని ప్రభుత్వంపై రిజిస్ట్రేషన్ చేశాకే అనుమతులు ఇస్తుండడంతో కొంత మార్పు వ చ్చింది. పంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న వెంచర్లు భారీగా అక్రమాలు జరుగుతున్నాయి.
ఎలాంటి అభివృద్ధి చేయకుండానే అనుమతులు పొంది ప్లాట్లు విక్రయిస్తున్నారు. కల్వకుర్తి, వెల్దండ మండలాల పరిధిలో జాతీయ రహదారులను అనుసరించి గ్రామాలు ఉండటంతో వందల ఎకరాల్లో వెంచర్ల నిర్మాణం జరుగుతుంది.
అందులో అనుమతుల సమయంలో అధికారులు అ క్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వెల్దండ, కొట్ర పెద్దాపూర్, కల్వకుర్తి మండలంలోని మార్చాలా , కుర్మిద , తాండ్ర, తర్నికల్ శివారులో భారీగా వెంచర్లు నిర్మించారు. వీటిలో ప్రభుత్వానికి రావాల్సిన 10 శాతం భూమి 50శాతం పైగా కనుమరుగైనట్లు తెలుస్తుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి స్థలాలను కాపాడాల్సిన అవసరం ఉంది.
రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తాం..
ప్రభుత్వ భూమిని కొనుగోలు చేసినట్లు నిర్ధారణ జరిగితే అట్టి రిజిస్ట్రేషన్లను రద్దు చేయడం జరుగుతుంది. 10 శాతం భూమిని ప్రభుత్వంపై రిజిస్ట్రేషన్ చేశాకే వెంచర్ లకు అనుమతులు ఇ స్తున్నాం. అన్ని అనుమతులు ఉంటేనే కొనుగోలు చేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
మహమూద్ షేక్, మున్సిపల్ కమిషనర్.కల్వకుర్తి