18-09-2025 12:39:41 AM
సాయుధ పోరాట యోధులకు నివాళులర్పించిన బిజెపి నాయకులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): మండలంలోని పొనుగోడు గ్రామంలో బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు పోకల వెంకటేశ్వర్లు,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో అనేక దారుణాలు జరిగాయి అన్నారు. ఆ సందర్భంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో ధైర్యసహసాలతో హైదరాబాదును దేశంలో విలీనం చేశారని వారు తెలిపారు.
రజాకార్లను తరిమికొట్టి తెలంగాణకు స్వతంత్ర అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ సేవలకు గుర్తుగా హైదరాబాద్ విమోచన దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రజాకార్ల అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచి వారిని తరిమికొట్టిన వీర చరిత్ర పొనుగోడు గ్రామానికి ఉందన్నారు.మండలంలోని పొనుగోడు గ్రామంలో నాటి తెలంగాణ సాయుధ పోరాట యోధులు గా నిలిచి అమరులైన దాసరి లింగన్న,బిల్లా సైదయ్య,వాసిరెడ్డి సత్యనారాయణ,కటకం మట్టయ్య,ఆవుల సీతారామయ్య, ప్రతి కంఠం వెంకటరాజు,అలుగుబెల్లి వీరారెడ్డి,ప్రతి కంఠం సూర్యం రాజు,చింతకుంట్ల వెంకటరెడ్డి,బోధ అప్పిరెడ్డి,బోధ కృష్ణారెడ్డి స్మారక స్థూపాలకు పూలమాలలు వేసి ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించారు.