calender_icon.png 18 September, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో రెవెన్యూ సిబ్బంది

18-09-2025 12:37:50 AM

రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన తహసీల్దార్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లా తల్లాడ మండ లం రెవెన్యూ కార్యాలయంలో అధికారులు రూ 10వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్‌పీ రమేష్ తెలి పిన వివరాల ప్రకారం తల్లాడ మండలంలో ఒక రైతుకు సంబంధించిన ౧౦గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు తహసీల్దార్ రూ. 10 వేలు డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించగా బుధవారం 10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. తహసీల్దార్ వంకాయల సురేష్, ఆర్‌ఐ మాలోత్ భాస్కర్, ధరణి ఆపరేటర్ రాథోడ్ రైతు నుంచి లంచం తీసుకుంటూ చిక్కారని తెలిపారు.