18-09-2025 12:40:13 AM
యంఎల్‌ఎలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి జేఏసీ.
కొత్తగూడెం, సెప్టెంబర్ 17,(విజయక్రాంతి):గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లు, ఇంటర్, డిగ్రీ ,పీజీ విద్యార్థుల పోస్టుమెట్రిక్ హాస్టల్స్ లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికుల వేతనాలను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన కా ర్మికుల నోటికాడ బువ్వ గుంజుకుంటుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ఐదుగురు గి రిజన ఎమ్మెల్యేలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని తెలంగాణ గిరిజన ఆశ్రమ పాఠశాలలో హాస్టల్ డైలీ వేజ్ వర్కర్స్ యూ నియన్స్ జేఏసీ నాయకులు కె.బ్రహ్మచారి ,బి నాగేశ్వరరావు ,ఏ హీరాలాల్ ప్రశ్నించారు.
బుధవారం కొత్తగూడెంలో జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. వేతనాలు త గ్గింపుకు వ్యతిరేకంగా గిరిజన కార్మికులు చే స్తున్న సమ్మెను ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా బలపరచాలని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి వేతనాలు తగ్గించకుండా నిర్ణయం చేయించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం రూ 26,800 వస్తున్న జీతం జీవో 64 వల్ల రూ 11 700కు తగ్గుతుందని ఒక్కొక్క కార్మికుడు సుమారు రూ 16 వేలు నష్టపోతున్నారని జేఏసీ పేర్కొన్నది .
అవుట్సోర్సింగ్ వర్కర్లకు GO.60 ప్రకారం నెలజీతం రూ 15,600 రావాల్సి ఉంటే క్యాటరింగ్ జీవో527 వల్ల రూ 9200 తగ్గించారని ఈ రెండు జీవోలు గిరిజన కార్మికుల పట్ల ఉరితాడుగా మారాయని, వీటిని తక్షణమే రద్దు చేయాలని జేఏ సీ డిమాండ్ చేసింది. బిఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం దుర్మార్గమైన చర్యగా జేఏ సీ పేర్కొన్నది.
బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటేనా? అని జెఎసి ప్రశ్నించింది. గత 30 సంవత్సరాలుగా అమలవుతున్న జిల్లా కలెక్టర్ కనీ స వేతనాల జీవోను తిరస్కరించి జీతాలు తగ్గిం చే 64 జీవోను అమలు చేయడం గిరిజన జాతికి ద్రోహం చేయటమే అవుతుందని జే ఏసీ పేర్కొన్నది. ఎక్కడైనా జీతాలు పెంచుతా రు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జీతాలు తగ్గిస్తుందని విమర్శించారు. గత ఏడు రోజులుగా స మ్మె జరుగుతుంటే గిరిజన ఎమ్మెల్యేలు ,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి మౌనంగా ఉండ టం ఎంతవరకు సమంజసం అని జేఏసీ ప్ర శ్నించింది.
30 ఏళ్లుగా పనిచేస్తున్న డైలీ వేజ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని లేదంటే టైం స్కేల్ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ వస్తే జీతాలు పెంచుతామ ని హామీ ఇచ్చి అదికారంలోకి వచ్చితరువాత వస్తున్న జీతాలు తగ్గించడం సంక్షేమం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజాపాలనంటే గిరిజనకార్మికుల నోటి కాడ ముద్దను గుంజుకోవడమేనా? సంక్షేమమంటే వస్తున్న జీతా లను తగ్గించడమేనా? అని జేఏసీ ప్రశ్నించిం ది. ఎమ్మెల్యేలు స్పందించి రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని లేదంటే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించా రు.
వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా అం దరూ కార్మికుల సమ్మెలో ఉన్నారని విద్యార్థులు చదువులు అభ్యంతరంగా ఆగిపోయా యని పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు, చదువుకోవాల్సిన విద్యార్థులు గంట్టెలు పట్టి వంటలు చేస్తున్నారని అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసిన చందంగా వ్యవహరిస్తుందని జేఏసీ విమర్శించింది.
ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి తక్షణం డైలీ వేజ్ వర్కర్లకు ఆరు నెలల పెండింగ్ వేతనాలు జిల్లా కలెక్టర్ గెజిట్ ప్రకారం చెల్లిం చాలని ఔట్సోర్సింగ్ వర్కర్లకు 10 నెలల వేతనాలు జీవో 60 ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని యెడల సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యేలు జోక్యం చేసుకొని గిరిజన కార్మికులకు న్యాయం చేయకపోతే ఎమ్మెల్యేలు ఎక్కడికిపోయినా అడ్డుకుంటామని డైలీ వేజ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ హెచ్చరించింది.