calender_icon.png 31 October, 2025 | 1:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘బీజేపీ నేతలు కాంగ్రెస్ గాలానికి చిక్కొద్దు’

04-05-2024 02:07:32 AM

కరీంనగర్, మే 3 (విజయక్రాంతి): బీజేపీ నేతలు కాంగ్రెస్ పార్టీ గాలానికి చిక్కొద్దని, చిక్కితే ఆ తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మ జయశ్రీ తన సోదరుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిని ఉద్దేశించి అన్నారు. కరీంనగర్‌లోని ఎంపీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ నేతలు ఇనుగాల పెద్దిరెడ్డి, జె.సంగప్పతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘తమ్ముడూ శ్రీరాం బీజేపీ నీకేం తక్కువ చేసింది. కష్టకాలంలో అక్కున చేర్చుకుంది. ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ నీకు టికెట్ ఇప్పించారు. ఆ సంగతి మరచిపోయావా? బండి సంజయ్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని సర్వేలు తేల్చాయి. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్ను పావుగా వాడుకోవాలని చూస్తున్నరు. నువ్వు ఆ మాయలో పడొద్దు..’ అని సూచించారు.