calender_icon.png 31 October, 2025 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత బిడ్డపై పగబట్టిన కాంగ్రెస్

04-05-2024 02:09:33 AM

సాయన్న కూతురు నివేదిత గెలుపు ఖాయం

కండువాలు మార్చడమే కాంగ్రెస్ అజెండా

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, మే3 (విజయక్రాంతి): దళిత ఆడబిడ్డపై కాంగ్రెస్ పగబట్టిం దని, సాయన్న కూతురు నివేదిత గెలుపు ఖాయమని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ కంటోన్మెంట్ ఎన్నికల ఇన్‌చార్జి రావుల శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఓల్డ్ బోయిన్‌పల్లిలోని బీఆర్‌ఎస్ కార్యాలయంలో ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా   రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఏడాది కాలంలోనే తండ్రి సాయన్న, చెల్లి నందితను కోల్పోయి న నివేదితకు ప్రజలు అండగా నిలవాలని కోరారు. సాయన్న కూతురు నివేదితను ఏకగ్రీవంగా గెలిపించాల్సింది పోయి ఆమెను ఓడించేందుకే బీఆర్‌ఎస్ నాయకులను కాం గ్రెస్‌లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ కండువాలు మార్చడమే కాంగ్రెస్ అజెండా అని, పేదల బతుకు ల్లో వెలుగులు నింపడమే బీఆర్‌ఎస్ లక్ష్యమని చెప్పారు. సీఎం రేవంత్, మైనంపల్లి కక్ష కట్టి తనను ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని నివేదిత ఆవేదన వ్యక్తంచేశారు.