22-08-2025 01:38:43 AM
పారిశ్రామికవాడలో వరద భయం
ప్రమాదహెచ్చరికను దాటి ప్రవహిస్తున్న గోదావరి
నీటమునిగిన పంట పొలాలు
అప్రమత్తమైన అధికారులు
బూర్గంపాడు, ఆగస్టు 21(విజయక్రాంతి): బూర్గంపాడు మండలంలో బూర్గంపాడు పాటు పారిశ్రామిక వాడ సారపాకను వరద భయపడుతుంది. గత ఏడాది జూలై నెలలో 70 అడుగులు దాటి గోదావరి ప్రవాహం ఉండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సారపాకలోని పలు కాలనీలతో పాటు బూర్గంపాడు మండలంలోని కోయగూడెం, తాళ్లగొమ్మూరు, ఇరవెండి, మోతే, బూర్గంపాడు, నాగినేనిప్రోలు రెడ్డిపాలెం,
సోంపల్లి గ్రామాల ప్రజలతో పాటు ఆశ్వాపురం మం డలంలోని నెల్లిపాక, చింతిర్యాలకాలనీ తదితర గ్రామాల ప్రజలు భయానికి గురవు తున్నారు.ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాయంత్రం 3 గంటలకు రెండవ ప్రమాదహెచ్చరికను దాటి 51.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. మరింత ప్రవాహం పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
50 అడుగులు దాటడంతో రహదారులపైకి వరదనీరు...
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం పెరుగుతుంటే చుట్టూ ఉన్న గ్రామాల్లో, పలు కాలనీల్లో వరద చేరే అవకాశం ఉంది. బూర్గంపహాడ్ మండలంలో 50 అడుగులకు ప్రవాహం వేరడంతో పరివాహక ప్రాంతమైన బూర్గంపహాడ్ మండలం లో సోంపల్లి వద్ద, ఇరవెండి-అశ్వాపురం, సారపాక- నాగినేనిప్రోలు రెడ్డిపా లెం, బూర్గంపహాడ్ నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామాల మధ్య ప్రధాన రహదా రులపైకి వరదనీరు వచ్చి వేరడంతో రహదారుల రాకపోకలు నిలిచిపోయాయి.
మోతేప ట్టీనగర్ లో సమ్మక్క, సారలమ్మ గద్దెలు సైతం వరదనీటిలో మునిగిపోయాయి. వర ద ప్రవాహంతో పారిశ్రామిక వాడలోని పలు కాలనీల్లోకి వరదనీరు మెల్లగా వచ్చివేరుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజ లు వరద కారణంగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
నీటమునిగిన పంట పొలాలు..
భద్రాచలం వద్ద గోదావరి వరద పెరగడంతో బూర్గంపహాడ్ మండల కేం ద్రంలో గంగరాజు యాదవ్కు చెందిన ఏడు ఎకరాల పత్తి వరదనీటిలో మునిగింది. అంతేకాకుండా లోతట్టు ప్రాంతాల్లో సు మారు 200 నుంచి 300 ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయని బాధితులు చెబుతున్నారు.
అప్రమత్తమైన అధికారులు....
గోదావరి వరదలతో మండల అధికార యంత్రాంగం ఆప్రమత్తమైంది. గత రెండు రోజులుగా గోదావరి దోబూచులాడుతుండటంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాల తో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మండలంలో తహశీల్దార్ కేఆర్ కెవి ప్రసాద్, ఎస్‌ఐ మేడా ప్రసాద్, ఎంపీడీవో జమలారెడ్డిలతో పాటు నీటిపారుదలశాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు మండలంలోని ముంపు ప్రభావిత గ్రామాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తు న్నారు.
బూర్గంపాడు లో కస్తూర్బా గాంధీ పాఠశాల, నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో జి ల్లా పరిషత్ హైస్కూల్, సారపాకలోని బీపీఎల్ స్కూల్లో పునరావాస కేంద్రాలు ఏర్పా టు చేయడగా బూర్గంపాడు కొల్లు ఏరియాలోని రెండు కుటుంబాలు పునరావాస కేం ద్రాలకు తరలివచ్చారు. ఎప్పటికప్పుడు వర ద పరిస్థితిని వివరిస్తూ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లేలా ఏర్పాట్లు చేస్తున్నా రు.
ఇప్పటికే వరద గ్రామాలను చుట్టుముట్టేందుకు సిద్ధంగా ఉండటంతో పాటు గో దావరి మరింత పెరిగే పరిస్థితి ఉండటంతో ముంపు వాసులకు పలు సూచనలు చేస్తున్నారు. వరద విధుల్లో అధికారులతో పాటు ఎంపీతో బాలయ్య, ఆర్వలు నర్సింహారావు, వీర్రాజు, కార్యదర్శులు కంద మహేష్, తలగాని మురళి, సావిత్రి, శ్రీకాంత్, మండల పరిషత్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.