22-08-2025 01:08:48 AM
చేవెళ్ల, అగస్టు 21: రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు స్పష్టం చేశారు. యూ రియా కొరత ఉందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోందని, ఇది రైతులను తప్పుదోవ పట్టిం చే ప్రయత్నమని విమర్శించారు. మోదీ ప్రభుత్వంలో రైతులకు కష్టాలు లేవన్నారు. గత ఏడాది రాష్ట్రానికి 22 లక్షల మెట్రిక్ ట న్నుల యూరియా వచ్చిందని వివరించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి యూరియా రావ డం లేదని కాంగ్రెస్ నేతలు, వ్యవసాయ శాఖ మంత్రి ప్రచారం చేయడంతో వ్యాపారులు యూరియాను బ్లాక్ చేశారని అన్నారు.
కాంగ్రెస్ నాయకుల కారణంగానే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. దీంతో రైతులు తీవ్ర గందరగోళానికి గురవడంతో యూరియా కోసం అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. అయితే రైతులకు అవసరమైనంత యూరియా అందుబాటులోనే ఉంద ని, రైతులు గందరగోళానికి లోనుకాకూడద ని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే రాష్ట్రానికి కావాల్సినంత యూరియా వస్తుందన్నారు. చేవెళ్ల లో ఫర్టిలైజర్ దుకాణాలు తనిఖీ చేసి అనంతరం రైతులతో ఆయన మాట్లాడారు.
కాం గ్రెస్ సర్కారు రెండేళ్లలో కేవలం రెండుసార్లు మాత్రమే రైతుబంధు ఇచ్చి.. ప్రస్తుతం ‘రైతు బంద్’ గా మార్చిందని ఎద్దేవా చేశారు. పల్లెపల్లెకు బీజేపీ కార్యక్రమంలో భాగంగా గురు వారం చన్వెల్లి గ్రామంలో రైతులతో సమావే శం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ చన్వెల్లిలో రైతులు దాదాపు 100 ఎకరాల్లో పూలు సాగుచేయడం అభినందనీయ మన్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఫసల్ బీ మా యోజనను అమలు చేయడం లేదన్నా రు. బీజేపీ అధికారంలోకి వస్తే రైతులకు అ న్ని రకాల సౌకర్యాలు అందిస్తామన్నారు.
బిల్లులు రావాలంటే భట్టి భార్యను కలవాలె
కాంగ్రెస్ సర్కారులో కాంట్రాక్టర్లకు బిల్లులు రావాలంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్యను కలవాల్సిన పరిస్థితి ఉందని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం ఆరోపించారు. 15 శాతం కమీషన్లు ఇస్తే తప్ప బిల్లులు మంజూరు కావడం లేదన్నారు. చన్వెల్లి గ్రామం లో వేసిన రోడ్డుకు బిల్లులు రాకపోతే గాలికొదిలేశారని మండిపడ్డారు. రైతు ఏడ్చిన రా జ్యం ముందర పడదని, రేవంత్ సర్కారుకు ఇదే గతి పడుతుందని విమర్శించారు.
ప్రా ణహిత చేవెళ్ల పేరిట రూ.8,200 కోట్ల రూపాలయలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకొని కమీషన్లు తిన్నారే తప్ప రూపాయి పనిచేయలేదన్నారు. అనంతరం ఖానాపూర్ గేట్ సమీపంలోయువ సమ్మేళనంలో పాల్గొన్నారు. శుక్రవారం ఆలూరు గ్రామంలో మ హిళా మీటింగ్‌లో పాల్గొంటారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ గౌడ్, కొప్పుల బాషా, ప్రభాకర్‌రెడ్డి, వెంకట్ రెడ్డి, అనంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.