22-08-2025 12:52:31 AM
కోయిల్ కొండ ఆగస్టు 21 (విజయ క్రాంతి) : అసలే వర్షాకాలం... ఆపై దోమలు ఈగలు ఎక్కువ.. నిరంతరం పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం తమ సొంతమం టూ అధికారులు నిత్యం చెబుతున్న మాట.. ఈ మాటను నిజం చేసేలా ప్రజలు జీవన మనుగడ తో ముందుకు సాగాలని చెబుతున్నప్పటికీ మల్లాపూర్ గ్రామంలో మాత్రం అపరిశుభ్రతకు కేరాఫ్ గా నిలుస్తుంది. ట్రా క్టర్ బాగు చేసేందుకు నిధులు లేక బాగు చే యలేక.
గ్రామంలో గత 15 రోజుల నుంచి చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. స్పందించాల్సిన అధికార యంత్రం నెలకొన్న సమస్యను పరిష్కరించడంలో విఫలమైంది. నిధు లు లేవు.. డబ్బులు ఎన్ని బయట నుంచి తీ సుకువచ్చి బాగు చేస్తామంటూ పంచాయతీ కార్యదర్శి సైతం ఆవేదన వ్యక్తం చేసే రోజులు వచ్చేశాయి. ప్రజాపాలన అంటూ ప్రభుత్వం గంభీరమైన మాటలు చెబుతున్నప్పటికీ వా స్తవ రూపంలో గ్రామాల్లో తీవ్ర ఇబ్బందుల్లో నెట్టుకొస్తున్నాయని చెప్పడంలో కోయిలకొండ మండలం మల్లాపూర్ గ్రామంమే ఉదాహరణ.
రోగాల బారిన పడుతున్న గ్రామస్తులు
గత 15 రోజుల నుంచి వర్షాలు కూడా అధికంగా ఉన్నాయి... ఆపైగా గ్రామంలో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయింది. గత ప్ర భుత్వము ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చే యాలని ట్రాక్టర్ తో పాటు గ్రామ పారిశుద్ధ్య కార్మికులను సైతం ఏర్పాటు చేసింది.
ఈ ఫ్యాక్టరీ నిరంతరం జరగాలని ప్రతిరోజు ట్రా క్టర్ ద్వారా చెత్త సేకరణ జరగాలని ఆ విధా నం కొనసాగుతున్నప్పటికీ గ్రామపంచాయతీలకు నిధులు లేకపోవడంతో ట్రాక్టర్లకు జ్వ రం వస్తే చూపించే వారే దిక్కు లేకుండా పో యింది.
అధికారులు సైతం చేతులెత్తేసి తా ము ఏం చేయలేమని చెప్పడం మరొక ప్ర త్యేక విశేషం. ఉన్నత అధికారులు స్పందించి ప్రత్యేకంగా నిధులు సరఫరా చేయడంతో పాటు సమస్యను పరిష్కరించాలని మల్లాపూర్ గ్రామస్తులు విన్నవించుకుంటున్నారు..
చుట్టూ ముట్టు తున్న సీజన్ వ్యాధులు..
అసలే వర్షాకాలం కావడంతో కంప చెట్ల తో పాటు ఎక్కడపడితే అక్కడ మురుగునీరు కూడా ఎక్కువగా నిలిచే అవకాశాలు ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు డ్రైనేజీలతోపాటు చిత్త సేకరణ సేకరిస్తూ పరిశుభ్రతకు అడుగులు వేయించవలసిన అధికారులు తాము ఏమి చేయలేమంటూ చేతులు ఎత్తిస్తే ప్రజ లు ఏమైపోయినా పర్వాలేదా అనే సాంకేతాన్ని సూచిస్తుంది.
డెంగీ, మలేరియా, టైఫాయిడ్, తో పాటు వివిధ రోగాల బారిన ప్రజలు పడుతున్నప్పటికీ అధికారులు చెత్త సేకరణకు చర్యలు తీసుకోకపోవడం విడ్డూరంగా ఉంది. ఇప్పటికైనా అధికార యంత్రం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
నిధులు లేవు.. ఉన్నత అధికారులకు చెప్పిన..
ట్రాక్టర్ బాగు చేసేందుకు నిధులు లే వు. ఎన్ని డబ్బులు అన్ని బయటనుంచి తీసుకురావాలి. తీసుకువచ్చినప్పటికీ డ బ్బులు రావడం లేదు. గ్రామంలో ఎవరైనా ముందుకు వస్తే బాగు చేస్తామని చెప్పినప్పటికీ ఎవరు ముందుకు రావ డం లేదు. దీంతో గత 12 రోజులుగా చెత్త సేకరణ చేయడం లేదు. ఎంపీటీవో కి కూడా సమాచారం అందించాను.
స్నిగ్ధ, పంచాయతీ కార్యదర్శి, మల్లాపూర్ గ్రామం, కోయిల్ కొండ మండలం