calender_icon.png 22 August, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ మద్దతు మాకొద్దు

22-08-2025 01:11:27 AM

  1. సంస్కరణల కోసమే 130వ రాజ్యాంగ సవరణ
  2. దీనిపై కాంగ్రెస్ తీరు దురదృష్టకరం
  3. జైలుకు వెళితే పదవి నుంచి దిగిపోవాల్సిందే
  4. కరైకల్ పోర్టులో యూరియా దిగుమతి
  5. ట్రాన్సిట్‌లో 50వేల మెట్రిక్ టన్నుల యూరియా 
  6. ఢిల్లీలో మీడియాతో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కేటీఆర్ మద్దతు తమకు అవసరం లేదని, ఆయనను ఎవరూ సపోర్టు అడగలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం ఢిల్లీలో ఆ యన మీడియాతో మాట్లాడారు. 130వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రధానమంత్రి, కేం ద్రమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రాల మంత్రులు ఎవరైనా తీవ్రమైన నేరారోపణ లు ఎదుర్కొని అరెస్టు అయి 30 రోజుల పా టు జైల్లో ఉన్నట్లయితే పదవినుంచి తొలగిపోవాలనే ఆలోచనతో కేంద్రం ఈ సంస్కర ణను తీసుకొచ్చిందన్నారు.

దేశమంతా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తోందని తెలిపారు. మే ధావులు, మీడియా, ప్రజలు ఈ సంస్కరణ పట్ల సంతోషంగా ఉన్నారని, దీనిపై లోక్ స భలో కాంగ్రెస్ పార్టీ వ్యవహరించిన తీరు, వారి అభిప్రాయాలు దురదృష్టకరమని వి మర్శించారు. ఇది కాంగ్రెస్ పార్టీకోసం తీసుకొచ్చిన చట్టం కాదని, అన్ని పార్టీలకు ఇది అమలవుతుందనే విషయం వారికి అర్థం కావడం లేదన్నారు. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ 6 నెలలు జైల్లో ఉండి అక్కడి నుంచే రివ్యూమీటింగ్స్ పెట్టేవారని, కేజ్రీవాల్ జైలు కు వెళ్లినా రాజీనామా చేయలేదన్నారు.

నైతిక విలువలను కాపాడేందుకు ఇలాంటి రాజ్యాంగ సంస్కరణలను తీసుకొచ్చిందన్నారు. దీనికి మద్దతుగా నిలవాల్సిన విపక్షా లు విరుద్ధంగా వ్యవహరించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వాలను నడిపేవారు, రాజకీ య నాయకులు, పార్టీలకు నైతిక విలువలు అవసరమని స్పష్టం చేశారు. దేశం కోసం దేశహితం కోసం కచ్చితంగా ఇలాంటి సంస్కరణలు తీసుకొస్తామని తేల్చి చెప్పారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంతుందో కాంగ్రెస్ పార్టీలో నీతి అంతుందని చురకలు అంటించారు.

ఇందిరాగాంధీ తన పార్లమెంటు సభ్య త్వాన్ని, ప్రధానమంత్రి పదవిని కాపాడుకునేందుకు 39వ రాజ్యాంగ సవరణతో ప్రధా నమంత్రికి విశేషాధికారాలు కల్పించిందన్నా రు. చేతిలో రాజ్యాంగం పట్టుకుని పార్లమెంటులో, బయట ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగ స్ఫూర్తితో వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. వెంకయ్య నాయుడు పోటీ చేసినప్పుడు, జీఎంసీ బాలయోగికి వ్యతిరేకంగా పోటీలో అభ్యర్థిని నిలిపినప్పుడు  తెలుగువారి ఆత్మగౌరవం గుర్తుకురాలేదా? అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. 

ట్రాన్సిట్‌లో 50వేల మెట్రిక్ టన్నుల యూరియా

అంతర్జాతీయంగా ఇబ్బందులున్నప్పటికీ  యూరియాను అందుబాటులో ఉంచేందు కు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. యూరియా దుర్వినియోగం కాకుండా రాష్ర్ట ప్రభు త్వం చూడాలన్నారు. కరైకల్ పోర్టులో యూ రియా ఉందని, ఇందులో 10వేల మెట్రిక్ ట న్నులు, ఇఫ్కో నుంచి 15వేల మెట్రిక్ టన్ను లు, క్రిబ్‌కో నుంచి 17,500 మెట్రిక్ టన్ను లు, ఆర్‌ఎఫ్‌సీఎల్ నుంచి 7,500 మెట్రిక్ ట న్నులు తెలంగాణకు వస్తోందన్నారు.

దాదా పు 50వేల మెట్రిక్ టన్నుల యూరియా ట్రా న్సిట్‌లో ఉందని తెలిపారు. తెలంగాణ మం త్రులు రోజూ యూరియా లేదని మాట్లాడటంతో దొరికిన చోట కొందరు దీన్ని స్టోర్ చేసుకోవడంతో సమస్య ఉత్పన్నమైందని మండిపడ్డారు. తెలంగాణకు 20 లక్షల మెట్రి క్ టన్నుల అవసరం ఉండగా, ఇప్పటివరకు 20 లక్షల మెట్రిక్ టన్నుల సప్లయ్ జరిగిందన్నారు. మరో 2 లక్షల యూరియాను అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. రైతులకు సహకరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై ఉందన్నారు.