calender_icon.png 22 August, 2025 | 4:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విష జ్వరాల నుంచి ప్రజలను కాపాడండి

22-08-2025 01:40:11 AM

ఇల్లందు టౌన్, ఆగస్టు 21,(విజయక్రాంతి)అకాల వర్షాల కారణంగా ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో పిచ్చి మొక్కలు చెత్తాచెదారం పేరుకుపోయి ప్రజలు విష జ్వరా లతో ఇబ్బందులు పడుతున్నారని బిఆర్‌ఎస్ యువజన నాయకులు లలిత్ కుమార్ పాసి అన్నారు.

గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలు ఆయన మాట్లాడుతూ అకాల వ ర్షాల కారణంగా విష జ్వరాలైన డెంగ్యూ మలేరియా వివిధ వ్యాధులతో ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే సం బంధిత అధికారులు శానిటేషన్ పనులను వేగవంతం చేసి రోగాల బారి నుండి ప్రజలను కాపాడాలని కోరారు. వార్డులలో బ్లీ చింగ్ చల్లడం, దోమల నివారణకు ఫాగింగ్ చేయాలని డిమాండ్ చేశారు.