calender_icon.png 22 August, 2025 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను రోడ్డుపాలు చేస్తరా?

22-08-2025 01:02:05 AM

  1. క్యూలైన్లలోనే సొమ్మసిల్లి పడిపోతున్న అన్నదాతలు
  2. యూరియా దక్కించుకునేందుకు తల్లడిల్లుతున్నరు..
  3. ‘ఎక్స్’ ద్వారా సీఎం రేవంత్‌పై కేటీఆర్ విమర్శలు 

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ‘తెలంగాణలో రైతులు యూ రియా కోసం తల్లడిల్లుతున్నరు. పంటను కాపాడుకునేందుకు అరిగోస పడుతున్నరు. రాష్ట్రంలో రైతులు మళ్లీ క్యూలైన్లలో చెప్పులు పెట్టే రోజు వచ్చింది. అలసి సొలసి అక్కడే సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితులు దాపురించాయి. అసమర్థ కాంగ్రెస్ పాలనకు ఇవన్నీ నిదర్శనాలు’ అంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ‘ఎక్స్’ వేదికగా విమర్శించారు.

వనపర్తి జిల్లా ఆత్మకూరులో క్యూ లైన్‌లో వరుసగా చెప్పు లు ఉండగా, దాని చివరన ఓ వృద్ధ రైతు అలిసిపోయి పడి ఉన్న ఫొటో ను షేర్ చేశారు. రైతులను ‘అప్పుల పాలు’ చేసిన చేతకాని పాలకులను చూశాం కానీ, ‘చెప్పుల పాలు’ చేసిన రికార్డు  మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు. బస్తా యూ రియా కోసం రైతుల బతుకులను బజారున పడేశారని, అందరి కడుపునింపే అన్నదాతను చెప్పుల చెంత సొమ్మసిల్లి, పడిపోయేలా ప్రభుత్వం పాపం చేసిందని పేర్కొన్నారు.