calender_icon.png 22 August, 2025 | 3:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ సీన్‌లో చెప్పిన పక్షి కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది

22-08-2025 12:53:10 AM

‘సినిమా బండి’ ఫేమ్ డైరెక్టర్ ప్రవీణ్ కాండ్రేగుల ‘పరదా’ అనే మరో సరికొత్త ప్రాజెక్ట్‌తో వస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా, దర్శన రాజేంద్రన్, సంగీత ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ, విజయ్ డొంకడ నిర్మిస్తున్నారు. ఆగస్టు 22న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలను కథానాయకి అనుపమ పరమేశ్వరన్ విలేకరులతో పంచుకుంది. 

* పరదా చాలా కొత్త కథ. ఇలాంటి కథలు ఇండియన్ సినిమాలో చాలా అరుదు. -డైరెక్టర్ ప్రవీణ్ నాకు కథ చెప్పినప్పుడు పరదాలోనే నా క్యారెక్టర్ ఎక్కువగా కనిపించింది. బాడీ లాంగ్వేజ్, డైలాగ్‌తో ఎలా నటించగలనని అనిపించింది. అయినా ఒక ఛాలెంజ్‌గా తీసుకొని ఈ సినిమా చేశాను. -ఈ కథ నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. చాలా సోల్ ఫుల్ ఫిలిం. 

* ఇందులో చాలా సీన్స్ నేను సైలెంట్‌గా ఉండొచ్చు. కానీ పరదా వెనుక నా క్యారెక్టర్ ఎమోషన్ ఉంటుంది. ప్రీమియర్స్ చూసిన చాలా మంది నేను కళ్లతోనే కాదు.. బాడీ లాంగ్వేజ్, వాయిస్‌తో కూడా యాక్ట్ చేయగలనని చెప్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. 

* ఈ కథకు నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఒక అమ్మాయి మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలదు. కచ్చితంగా ప్రేక్షకులు క్యారెక్టర్స్‌తో రిలేట్ అవుతారు. ముఖ్యంగా ఈ సినిమాలో -రాజేంద్రప్రసాద్‌తో చేసిన సన్నివేశానికి నేను చాలా కనెక్ట్ అయ్యాను. ఇప్పటికీ ఆ సమస్యకు నా దగ్గర జవాబు లేదు. అక్కడ చెప్పిన పక్షి కథ కచ్చితంగా మనల్ని ఆలోచనల్లోకి నెట్టేస్తుంది. సినిమా కథంతా ఆ సీన్‌లోనే ఉంది.

* సినిమా అంటే ఒక సెలబ్రేషన్. ఇలా ఒక్కసారి మనల్ని మనం ఆలోచింపజేసుకునే సినిమాలు కూడా రావాలి. మేము ఒక మంచి ప్రయత్నం చేశాం. నిజాయితీగా ఒక కథ చెప్పాం. ‘పరదా’ ఒక బోల్డ్ అటెంప్ట్. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఒక్క సెకండ్ ఆలోచించగలిగినా అది సక్సెస్‌గా భావిస్తాను. 

* నేను ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లవుతుంది. మరో రాష్ట్రానికి వెళ్లి ఇంత ఫేమస్ అవుతానని, ఇలాంటి ఒక లైఫ్ ఉంటుందని ఎప్పుడూ అనుకోలేదు. ఈ జర్నీ -అదష్టంగా భావిస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. వాళ్ల ప్రేమ వల్లే నేను తెలుగు నేర్చుకున్నాను. వాళ్ల పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను. తప్పకుండా వారిని అలరించే మరిన్ని అద్భుతమైన సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను.