calender_icon.png 22 August, 2025 | 3:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్రం మెడలు వంచి యూరియా తెస్తాం..

22-08-2025 01:06:11 AM

  1. శవాలపై పేలాలు ఏరుకునేలా బీజేపీ నేతల వ్యవహారం
  2. జీవితంలో యూరియా చూడనివారు కూడా మాపై విమర్శలు..
  3. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి పలుకుబడి ఉంటే రాష్ట్రానికి యూరియా వాటా తెప్పించాలి..
  4. మేమేదో యూరియా దాచిపెడుతునట్టు మాట్లాడుతున్నారు..
  5. దాచుకోవడానికి అదేమన్నా పంచదారా?
  6. చచ్చిన పార్టీని బతికించాలని బీఆర్‌ఎస్ నేతలనుకుంటున్నారు..
  7. చేజారిన అధికారాన్ని వారు తిరిగిపొందలేరు..
  8. మీరు రేపు ఓట్లు ఎవరికి వేస్తారో మాకు తెలుసు..
  9. దమ్ముంటే కేంద్రం నుంచి 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకురండి..
  10. మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 

హైదరాబాద్, ఆగస్టు 21 (విజయక్రాంతి): ‘కేంద్రం మెడలు వంచైనా తెలంగా ణకు యూరియా తెస్తాం.. రైతుల కష్టాలు తీరుస్తాం’ అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మం త్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద ప్రభుత్వం చేతగానితనం వల్లే తెలంగాణ రైతులకు యూరియా కష్టాలని పేర్కొన్నారు.

కేంద్రప్రభుత్వం ఈ నెలఖారులోపు తెలంగాణకు కేటాయించిన యూరి యాను పంపిణీ చేయాలని డిమాండ్ చేశా రు. శవాలపై పేలాలు ఏరుకునేలా రాష్ట్రంలో బీజేపీ నేతల వ్యవహారం ఉందని, జీవితంలో యూరియాను చూడని వారు, యూ రియాను చేత్తో పట్టుకోని వారు, పొలంలో గుప్పెడు యూరియా చల్లని వారూ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్‌రావు రైతుల సమస్యలతో రాజకీయాలు చేస్తే అధికారంలోకి వస్తామని భ్రమ పడతున్నారని, ఆయన కలలెప్పటికీ కల్లలుగానే మిగులుతాయని దుయ్యబట్టారు.

రాంచందర్‌రావుకు పలుకుబడి ఉంటే, కేంద్రం నుంచి తెలంగాణకు అందాల్సిన యూరియా వాటా తెప్పిం చాలని సవాల్ విసిరారు. ‘తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన యూరియా వివరాలను మీ చేతికి ఇస్తా. ఇంకా తెలంగాణకు ఎంత యూరియా రావాలో వాటిని చూస్తే మీకే తెలుస్తుంది. మీకు దమ్ముంటే కేంద్ర ఎరువులశాఖ మంత్రి జేపీ నడ్డాను నిలదీసి.. రాష్ట్రానికి యూరియా తీసుకురండి’ అని బీజేపీ నేతలకు సవాల్ విసిరారు.

బీజేపీ నేతలు చేస్తున్న మూర్ఖపు మాటలతో తమ పార్టీ బలపడదనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు. బాధ్యత గల పద విలో ఉండి రాంచందర్‌రావు సోయిలేకుం డా మాట్లాడుతున్నారని, అందుకే ఆ ఆయన పార్టీ పగ్గాలు చేపట్టిన మూడు నెలల్లోనే రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తున్నదని ఎద్దేవా చేశారు. ‘రాంచందర్‌రావుకు సౌ మ్యుడనే పేరుంది. కానీ, ఆయనకు యూరి యా గురించి ఏమీ తెలియదు.

పార్టీ పగ్గాలు చేపట్టిన మూడు నెలల్లోనే ఆయన అబద్ధాలు, అసత్యాలు వల్లె వేస్తూ, బీజేపీని బా గు చేయాలనుకుంటున్నారు. రైతుల పేరు చెప్పుకుని మీరెప్పటికీ అధికారంలోకి రాలే రు’ అని నిప్పులు చెరిగారు. ‘మీకు దమ్ముం టే అవాస్తవాలు, అసత్యాలను పక్కన పెట్టి.. వాస్తవాలను పరిశీలించి, మీకేదన్న పలుకుబడి ఉంటే, కేంద్రం తెలంగాణకు 60 వేల మెట్రిక్ టన్నుల యూరియా పంపించేలా చూడండి’ అని సవాల్ విసిరారు.

రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదించినంత యూరియాను కేంద్రం సరఫరా చేయడం లేదని, తాను ఆరు నెలల నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జేపీ నడ్డాకు గణాం కాలు చెప్తున్నానని, అయినప్పటికీ.. తిరిగి రాష్ట్రప్రభుత్వంపైనే బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ‘మేమేదో యూరి యాను దాచిపెడుతున్నట్లు బీజేపీ నేతలు మాట్లాడుతున్నారు.. యూరియాను దాచుకుని మేమేం చేస్తాం.. అదేమైనా పంచ దారా.. దాచుకోవడానికి ? అంత సోయి లే కుండా ఎలా మాట్లాడతారు ?’ అని మండిపడ్డారు.

యూరియా కోసం కేంద్రానికి ఎన్ని సార్లు లేఖలు రాసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చైనా నుంచి ఇంపోర్ట్ కావల్సిన యూరియా ను తెప్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, జియో పాలిటిక్స్ పరిస్థితులు వివరించకుండా కేం ద్రం గందరగోళం చేస్తోందని మండిపడ్డారు. రష్యా ఉక్రెయిన్, ఇరాన్ ఇజ్రాయిల్ యు ద్ధాల వల్ల ఎర్రసముద్రంలో నౌకాయానం నిలిచి, యూరియా దిగుమతిలో జాప్యం జరిగిందన్నారు.

బీజేపీ పరువే పోతుంది.. 

తెలంగాణకు అవసరమైనంత యూరి యా సరఫరాచేయకుండా, రాష్ట్రప్రభుత్వంపై బురదజల్లాలని చూస్తే, చివరకు బీజేపీ నేతల పరువే పోతుంది.. తమకేమీ పెద్దగా నష్టం ఉండదని మంత్రి స్పష్టం చేశారు. యూరియా పరంగా తెలంగాణకు ఉన్న అవసరం వేరని, ఇతర రాష్ట్రాల అవసరం వేరు గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రం లో పరిస్థితుల దృష్ట్యా ఆగస్టులోనే యూరి యా వాడాల్సిన పరిస్థితి ఉంటుదని, ఇక్కడ 77 శాతం రైతులు చిన్న, సన్నకారు రైతులేనని స్పష్టం చేశారు.

ప్రస్తుతం తాము యూ రియా అవసరం ఎక్కువగా ఉన్న జిల్లాలకు మాత్రమే సరఫరా చేస్తున్నామని తేల్చిచెప్పారు. రాజకీయ స్వార్థంతోసమే బీఆర్‌ఎస్, బీజేపీ రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని ధ్వజమెత్తారు.  రాష్ట్రంలో అధికా రం కోల్పోయిన బీఆర్‌ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తుతామని, బటన్ లు నొక్కుతామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తు న్నారని, వాటివల్ల పెద్దగా ప్రయోజనం లేద ని ఎద్దేవా చేశారు.

చైనా నుంచి యూరియా దిగుమతి చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని, జియో పాలిటిక్స్ పరిస్థితులను ప్రజలకు వివరించకుండా కేంద్ర ప్రభు త్వం రైతుల్లో గందరగోళం చేస్తోందని మం డిపడ్డారు. ‘రైతాంగానికి కావాల్సిన యూరియాను మేము ఏదో రకంగా కేంద్రంపై ఒత్తి డి తీసుకొచ్చి అందిస్తాం. రైతులు అధికారం పోయినొళ్ల మాటలు నమ్మి బజారుపాలు కావొద్దు. నిజంగా యూరియా కోసం వచ్చే వాళ్లు కొనుక్కొని వెళుతున్నారు.. వారితో ఏ గొడవ లేదు.

కానీ, యూరియా అవసరం లేకుండా రాజకీయ అవసరమున్న వారే హడావుడి చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికి లేదు. పనికిమాలిన మాటలు మాట్లాడే వారి కి ప్రజలే సమాధానం చెబుతారు ’ అని మం త్రి తుమ్మల హెచ్చరించారు.

పార్లమెంట్ ఆ వరణలో కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేస్తే, ఈ వారంలో 50 వేల మెట్రిక్ టన్నులు యూరియా ఇస్తామని కేంద్రం ఒప్పుకున్నదని గుర్తుచేశారు. విదేశాల నుంచి యూ రియా దిగుమతి సకాలంలో కాలేదని, దేశీయంగా ఉత్పత్తి అనుకున్న స్థాయిలో లేదని బీజేపీ నేతలు నిజాలు ఒప్పుకోవాలని హితవు పలికారు

బీఆర్‌ఎస్‌పై నిప్పులు చెరిగిన మంత్రి..

‘అక్కడక్కడా  కొందరు  సచ్చిపోయి న పా ర్టీని బతికించాలనో.. పోయిన అధికారం సా ధించాలనో విఫల ప్రయత్నం చేస్తున్నారు. కానీ, మీ ప్రయత్నం రైతులతో కాదు. కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వంతో కొట్లాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికి వేస్తారో మాకు తెలుసు. మీకు ద మ్ముంటే వాళ్ల దగ్గర నుంచి 2 లక్షల మె ట్రిక్ టన్నుల యూరియా తీసుకురండి. అబద్ధాలు మాట్లాడి పరువును తీసుకోవద్దు.

మిగిలిపోయిన మీ ఉనికిని మీరే చంపుకోవద్దు. ప్రాజెక్టుల వద్ద ఉన్న మో టర్ల బటన్లను మీరు నొక్కడమెందుకు? అక్కడ ఆపరేటర్ ఉంటాడు. ప్రాజెక్టులకు నీళ్లు వస్తే గేట్లు ఎలా ఎత్తాలో ఆపరేటర్ చూసుకుంటాడు.  ఓడిపోయిన మీరు బటన్ నొక్కుతాం అంటే ప్రజలను అపహస్యం చేసినట్లే. అధికారం లేకుండా రెండు సంవత్సరాలు ఉండలేకపోతున్నారు. ఆత్రుత పడకండి. కంగారుప డకండి. ఎండమావులను చూసి నీళ్లు అనుకోవద్దు.

ఆరాటపడితే, అధికారం రాదు.  మీ పంపకం, నొక్కడం చూసిన ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో.. అక్కడే పెట్టారు. ప్రతిపక్ష పార్టీగా మీరేం చేయాలో చేయండి. మీ పాత్ర మీరు నిర్వహించండి. అధికార పార్టీగా మేం ఏం చేయాలో మాకు తెలుసు.  ప్రతిపక్షంగా ఉండి అధికారంలో ఉన్నట్లు చెలాయిస్తామంటే..  ప్రజలు పిచ్చో ళ్లు కాదు. వాళ్లు తెలివైన వాళ్లు కాబట్టే.. మిమ్మల్ని గద్దె దించారు.

నేను గేట్లు ఎత్తు తా..? మీటర్లు నొక్కుతా..? అంటే ప్రజలే మీ కు బుద్ధి చెప్తారు’ అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బీఆర్‌ఎస్ నేతలనుద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ‘తెలంగాణ రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలో రెండు, మూడు చోట్ల మాత్రమే యూరియా సమస్య ఉంది. ఆ సమస్యలను రాజకీయంగా వాడుకోవాలని కొంతమంది చూస్తున్నారు. రైతాంగం నిబ్బరంగా ఉం డండి.. రైతాంగానికి కావాల్సిన యూరియాను మేం ఏదోరంగా ఒత్తిడి తీసు కొచ్చి ఇస్తాం’ అని హామీ ఇచ్చారు.