22-08-2025 01:35:48 AM
కలెక్టర్ హనుమంతరావు, డీసీపీ ఆకాంక్ష యాదవ్
యాదాద్రి భువనగిరి ఆగస్టు 21 ( విజయ క్రాంతి ): ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అన్నారు. గురువారం రోజు కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటుచేసిన శాంతి సమావేశ కమిటీలో డిసిపి ఆకాంక్ష యాదవ్, ఏసిపి రాహుల్ రెడ్డి, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తి లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ప్రశాంత వాతావరణంలో వినాయక చతుర్థి, మిలాద్-ఉన్-నబీ వేడుకలు ఘనంగా జరుపుకోవా లని కలెక్టర్ పిలుపునిచ్చారు. కలెక్టర్, డిసిపి సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు.
మిలాద్-ఉన్-నబీ, గణేష్ ఉత్సవాల సందర్భంగా చేపట్టాల్సిన చర్యలు, అందుబాటులోకి తేవాల్సిన సదుపాయాల గురించి గణేష్ మండలి ప్రతిని ధులు, శాంతి కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు, మండపాల నిర్వాహకులు అభిప్రాయాలను వెల్లడించారు. ఎస్సీ ట్రాన్స్ కో ఇరిగేషన్, ఆర్ అండ్ బి పంచాయతీ రాజ్, మత్స్యశాఖ ఫైర్, మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు.
గణేష్ ఉత్సవాలను కనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్ల మరమ్మతులు, శోభాయాత్రకు అడ్డంకిగా ఉండే చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టడం జరుగుతుందన్నారు. జిల్లాలో సహృద్భావ వాతావర ణంలో ఈ వేడుకలు జరుగుతాయని, ఈసారి కూడా అదే స్ఫూర్తి తో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని, జిల్లా ప్రతిష్టను పెంపొందించాలని అన్నారు.
గతేడాది తరహాలోనే ఈసారి కూడా వినాయక నిమ జ్జనం, మిలాద్-ఉన్-నబీ వేడుక వెంటవెంటనే వస్తున్నందున భద్రతాపరమైన చర్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. మంటపాల వివరాలను ట్రాన్స్ కో అధికారులకు తెలియజేసి, ఆ శాఖ సిబ్బంది ద్వారానే విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసుకోవాలని హితవు పలికారు. షార్ట్ సర్క్యూట్ వంటి వాటిని నిరోధించే ఉపకరణాలను అమర్చుకోవాలని ఎస్సీ ట్రాన్స్కో అధికారులకు తెలిపారు..
వినాయక నిమజ్జనోత్సవం సందర్భంగా ప్రమాదాలు జరుగకుండా ఉండేందుకు విగ్రహాలు నిమజ్జనం చేసే ప్రక్రియ అయిపోయే వరకు అధికారులు పర్యవేక్షణ జరపాలని, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచుతూ క్రేన్, లైటింగ్ వ్యవస్థ, అత్యవసర వైద్యం, , తాగునీరు, బారికేడింగ్, ట్రాఫిక్ క్రమబద్దీకరణ, పారిశుధ్యం వంటి చర్యలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
డిసిపి ఆకాంక్ష యాదవ్ మా ట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలుగకుండా వినాయక మంటపాలు ప్రతిష్టించాలని సూచించారు. ప్రతి గణేష్ మండపం వద్ద అవసరమైన బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.భారీ శబ్దాల వల్ల, హాస్పటల్లో ఉన్న పేషెంట్లు, చిన్నారులు, వృద్దులు ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉన్నందున మంటపాల వద్ద డీ.జే సౌండ్లను నిషేదించడం జరిగిందని డిసిపి తెలిపారు.
నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్ లను తయారు చేయాలన్నారు.మండపాల వద్ద భక్తి పాటలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసేలా నిర్వాహకులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో ఏసీబీ రాహుల్ రెడ్డి, అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, భాస్కరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణారెడ్డి, జిల్లా రెవిన్యూ అధికారి జయ మ్మ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి నాగిరెడ్డి వివిధ శాఖల అధికారులు, గణేష్ మండలి ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.