03-09-2025 01:56:38 PM
హైదరాబాద్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో బుధవారం జరగబోయే బహిరంగ సభ ఏర్పాట్లను రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) పరిశీలించారు. ఈ సభకు ముఖ్య అతిధిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఇతర మంత్రులు రానుండడంతో మంత్రి పొంగులేటి దగ్గరుండి సభ ప్రాంగణ ఏర్పాట్లను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు మంత్రి సూచించారు.