15-07-2025 08:55:07 PM
తాడ్వాయి,(విజయక్రాంతి): లంబాడ హక్కుల పోరాట సమితి కార్యవర్గాన్ని మంగళవారం ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం లంబాడ హక్కుల పోరాట సమితి కార్యవర్గం అధ్యక్షుడిగా నందివాడ పల్లె గడ్డ తండా చెందిన నునావత్ మోహన్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కాట్రోత్ రమేష్ నాయక్, ఉపాధ్యక్షులుగా అజ్మీర స్వామి, అధ్యక్షులుగా ధన రామ్, యూత్ అధ్యక్షులుగా రవి, ప్రధాన కార్యదర్శిగా శ్రీను, కోశాధికారిగా సేవియా, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సంతోష్, సహాయ కార్యదర్శిగా వినాయక్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా వినాయక్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా విశ్వనాథు లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.