calender_icon.png 16 July, 2025 | 4:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజాయి తాగుతున్న వ్యక్తిపై కేసు నమోదు..

15-07-2025 08:48:33 PM

130 గ్రాముల గంజాయి స్వాధీనం

బెల్లంపల్లి అర్బన్,(విజయక్రాంతి):  నెన్నల మండలం జెండా వెంకటాపుర్ గ్రామానికి చెందిన ఎస్కూరి శశి కుమార్(19) అనే వ్యక్తి గంజాయి సేవిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. నెన్నల ఎస్సై ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జెండా వెంకటాపుర్ గ్రామ శివారులో ఉన్న మామిడి తోటలో గంజాయి తాగుతున్నానే సమాచారం మేరకు వెళ్లి దాడి చెయ్యగా అక్కడ శశి కుమార్ దొరికాడు. అతని చేతిలో ఒక కవర్ లో 130 గ్రాముల  గంజాయి లభించింది. శశి కుమార్ ను విచరించగా గంజాయిని భీమారం మండలo ఆరేపల్లి గ్రామానికి చెందిన ఆకుదరి రాకేష్ అమ్మినట్లు చెప్పాడు. ఈ మేరకు అతనిపై కూడా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.