calender_icon.png 9 October, 2025 | 6:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ గెలుపునకు కృషి చేయాలి

09-10-2025 12:00:00 AM

-స్థానిక ఎన్నికలపై పార్టీ శ్రేణులకు ఎంపీ నగేష్ పిలుపు

ఆదిలాబాద్, అక్టోబర్ 8 (విజయక్రాం తి): స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ విజయ డంకా మోగించేలా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని ఎంపీ గోడం నగేష్ పిలుపునిచ్చారు. త్వరలో జరగనున్న స్ధానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో  సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడ, బోథ్, నేరేడిగొండ మండలాల్లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎంపీ నగేష్ మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరించి, ప్రజలను మోసం చేస్తుందన్నారు. గత పదేళ్లు పాలించిన బీఆర్‌ఎస్ ను, ప్రస్తుత కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని,  అందుచేతనే బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. జడ్పిటిసి, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలు ఎక్కువ శాతం బీజేపీ అభ్యర్థులు గెలిచేలా అందరూ కలిసి కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, నాయకులు తాటిపెళ్లి రాజు, ప్రశాంత్ కదం, జి.వి.రమణ, గాదె శంకర్, చంద్రకాంత్, రమేష్, అమూల్, రవీందర్, ఆయా మండలాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.