09-10-2025 12:00:00 AM
రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖమంత్రి జూపల్లి కృష్ణారావు
కొల్లాపూర్ అక్టోబర్ 8 : కొల్లాపూర్ ప్రాంతానికి గర్వకారణమైన సీపీఐ జాతీయ నాయకుడు, మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి జీవిత చరిత్రను పుస్తకరూపంలో ముద్రించి ఇంటింటికి చేరుస్తామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు.బుధవారం కొల్లాపూర్లో నిర్వహించిన సురవరం సుధాకర్ రెడ్డి స్మరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సురవరం ప్రజల కోసం జీవితాంతం పోరాడిన నాయకుడు.
ఆయన స్ఫూర్తిదాయక జీవితాన్ని నేటి తరానికి చేరవేయడం మన అందరి బాధ్యత. అందుకే ఆయన విగ్రహాన్ని కొల్లాపూర్ పట్టణ కేంద్రంలో ప్రతిష్టించి ఆయన జీవిత చరిత్రను పుస్తకంగా ముద్రించి ప్రతి ఇంటికీ చేరుస్తామన్నారు. వారితోపాటు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, సిపిఐ జాతీయ కార్యదర్శి పళ్ళ వెంకట్ రెడ్డి ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీరo హర్ష వర్ధన్ రెడ్డి, బీజేపీ నాయకులు ఏల్లేని సుధాకర్ రావు,సిపిఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు, సిపిఐ జిల్లా కార్యదర్శి ఫయాజ్, శ్రీనివాసు యాదవ్, దండోరా నాయకులు కోళ్ల వెంకటేష్, ఈశ్వర్, సురవరo సతీమని విజయ్ లక్ష్మి కుటుంబ సభ్యులు, కమ్యూనిస్టు నాయకులు తదితరులుపాల్గొన్నారు.